నారా లోకేశ్‌ది నాన్‌స్టాప్ కామెడీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Published : Aug 10, 2021, 03:09 PM ISTUpdated : Aug 10, 2021, 03:11 PM IST
నారా లోకేశ్‌ది నాన్‌స్టాప్ కామెడీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సారాంశం

చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్‌తో పోలుస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  ఆయన కామెడీకి అడ్డూ అదుపూ ఉండదంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

అమరావతి: చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. నారా లోకేశ్‌ను సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్ పోలుస్తూ ట్వీట్ చేశారు. లోకేశ్ రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే ఉంటుందని చలోక్తులు విసిరారు.

‘రాజకీయాలను సర్కస్‌తో పోల్చడం కొత్తేమీ కాదు. కాకపోతే సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే’ అని పేర్కొన్నారు. మోకాల్లోతు నీళ్లలో లైఫ్ జాకెట్‌తో దిగి లోకేశ్ బఫూన్ హాస్యం పండిస్తున్నాడు. చిట్టి నాయుడి కామెడీకి స్టాప్ గేట్లు  ఉండవు’ అని ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!