సీఎం ఇలాకాలో పదివేల మందితో రఘురామ మీటింగ్..: తీవ్రంగా హెచ్చరించిన మరో ఎంపీ

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 7:17 PM IST
Highlights

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ను కోరతామని మరో వైసిపి ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. 

తాడేపల్లి: చెప్పులు కుట్టుకునేవారమని దళిత జాతిపై అసూయ, ధ్వేషంతో రగులుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అవమానకరంగా మాట్లాడారని... అందువల్లే ఎస్సీ కమిషన్  ఛైర్మన్ ను కలిసి ఆయనపై ఫిర్యాదు చేసినట్లు వైసిపి ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపి ఎంపీపై కేసు నమోదు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ వెల్లడించారు. 

ఇంతటితో ఆగకుండా రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కూడా కోరతామన్నారు. తన సెక్యూరిటీతో తోలు ఓలిపిస్తానని ఎంపీ మాట్లాడారని... ఎదుటి వారిని కాల్చిచంపేందుకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదని గుర్తించాలన్నారు.  కాబట్టి వెంటనే ఆయనకు కల్పిస్తున్న సెక్యూరిటీ తొలగించాలని రేపు స్పీకర్ ను కలసి కోరతామని సురేష్ వెల్లడించారు. 

read more   క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి... : కొడాలి నానికి రఘురామ వార్నింగ్

''దళితులు ఒట్లు వేస్తేనే రఘురామ కృష్ణంరాజు ఎంపీ అయ్యారు. అది మర్చిపోయి ఆయన అహంకారంతో  మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో దళిత సంఘాలు, ఆయన నియోజక వర్గంలో దళితులు ఆయన్ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఆయన ముక్కుకు నేలకు రాసి పార్లమెంటులో అడుగు పెట్టాలి'' అని ఎంపీ మండిపడ్డారు.

''కృష్ణంరాజు పులివెందుల్లో పదివేల మందితో సభ పెడతామంటున్నారు. అడవుల్లో ఎవరు మొరుగుతారో... వీధుల్లో ఎవరు మొరుగుతారో చూద్దాం. జోహార్ సీఎం అని  కృష్ణంరాజు మాట్లాడటం దారుణం. ఢిల్లీలో సిగ్గు విడిచి తిరుగుతోన్న వ్యక్తి రఘురామ కృష్ణంరాజు'' అని విమర్శించారు. 

''రఘురామ కృష్ణంరాజు వేలకోట్లు ఎలా కూడబెట్టారో ప్రజలందరికీ తెలుసు. తిరిగి నీవు వాస్తవ పరిస్థితికి వస్తావు. విగ్గు విషయంలో కావచ్చు పదవి విషయంలో కావచ్చు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బుద్ది చెప్పేందుకు దళిత సంఘాలు సిద్దంగా ఉన్నారు'' అని నందిగం సురేష్ హెచ్చరించారు. 

click me!