వైఎస్సార్ మృతిపై చంద్రబాబుపై అనుమానాలు... ఇప్పుడు జగన్ పై కూడా..: ఎంపీ మోపిదేవి షాకింగ్ కామెంట్స్ (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 25, 2021, 2:45 PM IST

సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ఏరియల్ సర్వేపై కామెంట్స్ చేసిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడికి వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కౌంటరిచ్చారు.   


గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు సీఎం జగన్ ఏరియల్ సర్వే గురించి చేసిన కామెంట్స్ పై వైసిపి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు సీరియస్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలిలో ఎగురుతూ గాలిలోనే కలిసిపోతాడని చంద్రబాబు అనడాన్ని మోపిదేవి తప్పుబట్టారు. మానవత్వం కలిగిన ఏ వ్యక్తీ ఎదుటివ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడరని అన్నారు. చంద్రబాబు ఏ ఉద్దేశంతో సీఎం జగన్ గాలిలో కలిసిపోతారని అన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం వుందన్నారు మోపిదేవి. 

''గతంలో దురదృష్టవశాత్తు ఎంతో ప్రజాధరణ కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో YS Rajashekhar Reddy మృతిపై ప్రజల్లో అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఇలా అనుమానించిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. యావత్ ఆంధ్రరాష్ట్రం Chandrababu Naidu ని అనుమానించిన సందర్బాలు ఉన్నాయి. ఆ అనుమానం ఇంకా అందరి హృదయాల్లో ఉండగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ys jagan ను ఉద్దేశించి గాలిలో కలిసిపోతావని వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది'' అంటూ mopidevi venkatramana సంచలన వ్యాఖ్యలు చేసారు.  

Latest Videos

వీడియో

''చంద్రబాబు నాయడు కుటుంబానికి అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి ఒకటి ఉందని అందరికి తెలుసు. వయసు పైబడిన తరువాత మతిమరుపు సంక్రమించటం, ఆ తర్వాత మంచానపడిన చంద్రబాబు తండ్రిని చూశారు. ఇప్పుడు చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా అదే పరిస్థితిలో వున్నారు. ఈ మధ్య చోటుచేసుకున్న సంఘటనలు చూస్తే చంద్రబాబు కూడా అల్జీమర్స్ భారిన పడ్డాడేమో అన్న అనుమానం కలుగుతోంది'' అని మోపిదేవి ఎద్దేవా చేసారు. 

read more  ఆ ఫుటేజీ బయటపెడితే... చంద్రబాబు చిప్పకూడు తినేవాడు..: వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలనం (వీడియో)

''మన రాష్ట్రంలో YSRCP Governement జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి పక్కరాష్ట్రాల ప్రతినిధులు వచ్చి తెలుసుకునే పరిస్థితి వుంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది... అభివృద్ది జరగడంలేదని చంద్రబాబు, nara lokesh మాట్లాడుతుంటే ప్రజలు అల్జీమర్స్ ప్రభావమే అనుకుంటున్నారు'' అని వైసిపి ఎంపీ ఎద్దేవా చేసారు. 

''ఈ మధ్య చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ సందర్బంలేని మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వైసిపి నాయకులు అనరాని మాటలు అన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరు ఎటువంటి ప్రస్తావన చేయకపోయినా నా భార్య గురించి మాట్లాడారంటూ చంద్రబాబు ఆయన కుటుంబ పరువు ప్రతిష్టలను ఆయన తీసుకుంటున్నారు. దురుదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది'' అన్నారు. 

read more  జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమా? : మంత్రి కొడాలి నాని

''ఈ మధ్య చంద్రబాబు తన స్తాయిని తానే దిగజార్చుకుంటున్నాడు. నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్దమనిషి ఈ విధంగా తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడు. చంద్రబాబు సహనాన్ని కోల్పోతున్నారు'' అని మోపిదేవి పేర్కొన్నారు. 

''ముఖ్యమంతి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నారా లోకేష్ ఏం మాట్లాడాలో తెలియక ఎయిడెడ్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడు.ఎయిడెడ్ వ్యవస్థను బ్రష్టు పట్టించింది తన తండ్రి చంద్రబాబేనని లోకేష్ గుర్తించారు. తండ్రి కొడుకులు అధికారం కోసం నాటకాలాడుతున్నారు'' అని ఎంపీ మోపిదేవి మండిపడ్డారు.
 

click me!