ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరో సారి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మండిపడ్డారు. తన భార్యను తానే అల్లరి చేసుకొంటూ నన్ను క్షమాపణ చెప్పడంలో అర్ధం లేదని చంద్రబాబును ప్రశ్నించారు మంత్రి నాని
అమరావతి: తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబితే ఎన్టీఆర్ కుటుంబం ఏకమౌతుందని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గురువారం నాడు నాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మాకూ,జూనియర్ ఎన్ఠీఆర్ కు సంబందం ఏంటి..?ఒకప్పుడు కలిసున్నాం..ఇప్పుడు విడిపోయామన్నారు. జూనియర్ ఎన్ఠీఆర్ చెప్తే మెమెందుకు వింటామని ఆయన ప్రశ్నించారు.
గొర్రె కసాయిని నమ్మినట్టు ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబును నమ్మిందన్నారు. ఎన్ఠీఆర్ కుటుంబం మాటలు చూసి జాలేసిందన్నారు.అసెంబ్లీలో కానీ, బయట కానీ Chandra babu సతీమణి Nara Bhuvaneshwari పేరు తీయలేదని మంత్రి స్పష్టం చేశారు . తన భార్యను తానే అల్లరి చేసుకొంటూ నన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం అర్ధరహితమని మంత్రి Kodali Nani మండి పడ్డారు. జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. నందమూరి ఫ్యామిలీ అంటే ఏపీ సీఎం జగన్ కు కూడా గౌరవమేనని నాని చెప్పారు.నందమూరి ఫ్యామిలీ అమాయకులని నాని అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ఆయన చెప్పారు. చంద్రబాబు కు వయసొచ్చినా బుద్ది జ్ఞానం రావడం లేదన్నారు. చంద్రబాబు ఎందుకు బతికున్నాడో తెలియదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ అవసరాల కోసం తన భార్యను రోడ్డు మీదకు లాగారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
తన తల్లిని అవమానించారని లోకేష్ వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి నాని తప్పు బట్టారు. వరదలతో ఇబ్బంది పడే వారి దగ్గర నీ భార్య గొడవ ఎందుకని మంత్రి ప్రశ్నించారు.జగన్ ను వేధించిన సోనియా నుంచి నీ కొడుకు వరకూ అన్నీ అనుభవించారన్నారు.ఎర్రన్నాయుడు,శంకర్రావు,లోకేష్ పరిస్థితి ఏమిటని మంత్రి కొడాలి నాని అడిగారు. రాజశేఖర్ రెడ్డి మరణం చాలా గొప్పది. పదేళ్లయినా జనం మరిచిపోలేదన్నారు. మీరు బతికున్నప్పటికీ ప్రజల దృషిలో చనిపోయినట్లే లెక్క అని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి నాని.పరిస్థితి కుదుట పడిన తర్వాత వరద బాధితుల దగ్గరకు సీఎం వెళ్తారన్నారు. . 6 గంటల్లో 32 టీఎంసీ ల నీళ్లు ఎలా బయటకు వెళ్తాయియని కొడాలి నాని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉంటుందని మంత్రి అడిగారు. తనకు, వంశీ కి సెక్యూరిటీ అవసరం లేదన్నారు .చంద్రబాబు కు దమ్ముంటే తన వద్ద ఉన్న సెక్యూరిటీని వదిలేసి రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ నెల 19న ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. తన భార్య గురించి వైసీపీ సబ్యులు వ్యాఖ్యానించడంపై తట్టుకోలేక ఆయన ఏడ్చారు. అయితే తమ పార్టీకి చెందిన సభ్యులు ఎవరూ చంద్రబాబు సతీమణి గురించి వ్యాఖ్యలు చేయలేదని సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు చెప్పారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో చంద్రబాబు ప్రస్టేషన్ లో ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదో తెలియడం లేదని జగన్ చెప్పారు.