లోకేష్‌ పాదయాత్రతో ఎవరికి లాభం.. కనీసం సెల్ఫీలు దిగడం లేదు : ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 23, 2023, 06:25 PM IST
లోకేష్‌ పాదయాత్రతో ఎవరికి లాభం.. కనీసం సెల్ఫీలు దిగడం లేదు : ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఆయనతో అసలు ఎవరైనా సెల్ఫీలు దిగుతున్నారా అంటూ సెటైర్లు వేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రతో ఎలాంటి ఉపయోగం లేదని.. ఆయనతో అసలు ఎవరైనా సెల్ఫీలు దిగుతున్నారా అంటూ సెటైర్లు వేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిపై చంద్రబాబు రాళ్లదాడి చేయించడం దారుణన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని.. అదే విధంగా వై నాట్ 175 దిశగా ముందుకు సాగుతామని భరత్ అన్నారు. రాజమండ్రి సిటీ వైసీపీ ఇన్‌ఛార్జ్ విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటానని ఆయన స్పష్టం చేశారు. అర్బన్ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత తనదేనని ఎంపీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలతో జగన్ పాలన సాగిస్తున్నారని భరత్ ప్రశంసించారు. 

Also Read: మేకప్ వేసుకొని తిరుగుతున్నారా?: మంత్రి రజనిపై చింతమనేని వివాదాస్పద వ్యాఖ్యలు

అంతకుముందు మంత్రి విడదల రజనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్. మంత్రి రజని మేకప్ వేసుకొని తిరగడం తప్ప  చేసేదేమీ లేదన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో  సరైన సౌకర్యాలు లేకపోవడంపై  చింతమనేని ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో  బాధితురాలు  ప్రియాంకను చింతమనేని  ప్రభాకర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో   సౌకర్యాలు లేని విషయాన్ని గుర్తించారు. అప్పటికప్పుడే సూపరింటెండ్  కు ఫోన్  చేశారు. ఫోన్ లోనే  చింతమనేని సీరియస్ అయ్యారు. బర్నింగ్  వార్డులో  ఏసీలు  పనిచేయకపోవడంపై  సూపరింటెండ్ పై ఆగ్రహం వ్యక్తం  చేశారు. గంటసేపు ఈ వార్డులో కూర్చోవాలని సూపరింటెండ్ ను కోరారు. నిధులు లేకపోతే  ప్రభుత్వం నుండి తెప్పించుకోవాలని  చింతమనేని  ప్రభాకర్ చెప్పారు

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu