ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సభపై రాళ్ల దాడి ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు ఇందేం కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు కార్యక్రమాన్ని అడ్డుకొన్నారు. నల్లజెండాలు, బెలూన్లతో చంద్రబాబు కార్యక్రమానికి అడ్డు తగిలారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.
చంద్రబాబునాయుడు ఎర్రగొండపాలెంలో నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. జీవో నెంబర్ 1ను ఉల్లంఘించారని ఈ కేసు నమోదు చేశారు. సెక్షన్ 188, 283 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాళ్లదాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త హరిబాబు ఫిర్యాదుపై కేసు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరో వైపు వైసీపీ కార్యకర్తసయ్యద్ ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 143, 147, 148, 324, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేశారు.
రెండు రోజుల క్రితం ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేనులు అడ్డుకున్నాయి. రాళ్ల దాడికి దిగాయి. అయితే ఈ దాడిలో చంద్రబాబు కు రక్షణగా ఉన్న ఎన్ఎస్‌జీ కమాండో సంతోష్ కుమార్ తలకు గాయమైందిఎర్రగొండపాలెంలో గాలి,, వర్షం కారణంగా సభ కోసం ఎంపిక చేసిన స్థలంలో సభను నిర్వహించలేకపోయినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. . ఈ కారణంగానే రోడ్డుపై నే కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని టీడీపీ నేతలు చెబుతున్నారు.