‘‘జిన్నాటవర్’’ వివాదం.. జగన్ ముందు మీ ఆటలు సాగవు: బీజేపీ నేతలకు వైసీపీ నేత అప్పిరెడ్డి వార్నింగ్

Siva Kodati |  
Published : Dec 30, 2021, 06:56 PM IST
‘‘జిన్నాటవర్’’ వివాదం.. జగన్ ముందు మీ ఆటలు సాగవు: బీజేపీ నేతలకు వైసీపీ నేత అప్పిరెడ్డి వార్నింగ్

సారాంశం

గుంటూరులోని జిన్నాటవర్‌‌ పేరు మాల్చాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న రాద్ధాంతంపై మండిపడ్డారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి.  జిన్నాటవర్ పేరు మార్చాలనడం, లేదంటే కూలుస్తామని బీజేపీ నేతలు మాట్లాడడం విద్వేషపూరితమన్నారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. 

గుంటూరులోని జిన్నాటవర్‌‌ పేరు మాల్చాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న రాద్ధాంతంపై మండిపడ్డారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిన్నాటవర్ పేరు మార్చాలనడం, లేదంటే కూలుస్తామని బీజేపీ నేతలు మాట్లాడడం విద్వేషపూరితమన్నారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను కీర్తించే విష సంస్కృతి బీజేపీ సొంతమంటూ దుయ్యబట్టారు. మత ఘర్షణలు సృష్టించడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునే యత్నం చేస్తోందని ... జగన్‌ పాలనలో వున్న ఏపీలో మీ ఆటలు సాగవంటూ అప్పిరెడ్డి హెచ్చరించారు. 

కాగా.. BJp జాతీయ కార్యదర్శి Satya kumar ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. Guntur  పట్టణంలో Jinnah సెంటర్  విషయమై సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. జిన్నా టవర్ సెంటర్ పేరును Abdul kalam  లేదా Gurram Jashuva పేరుతో మార్చాలని  ఆయన డిమాండ్ చేశారు..

ఈ డిమాండ్ తో బీజేపీకి  చెందిన ఏపీ నేతలు కూడా ఏకీభవించారు.పాకిస్తాన్ లో ఉండాల్సిన జిన్నా పేరును ఏపీలో ఉండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా కూడా  తొలగించాల్సిందేనని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.   

ALso Read:గుంటూరులో జిన్నాసెంటర్‌పై బీజేపీ నేత సత్యకుమార్ ట్వీట్‌: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

అయితే ఇదే విషయమై తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే  Raja singh కూడ స్పందించారు. ఈ పేరును మార్చాలని ఆయన కోరారు. దేశ విభజనతో పాటు అనేక మంది మరణానికి జిన్నా కారణమన్నారు. జిన్నా పేరుతో సెంటర్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై జోక్యం చేసుకొని ఈ పేరును మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

రాష్ట్రం విడిపోయాక Tdp, Ycpలు పాలన సాగించాయని వారెందుకు పేరు మార్చలేదని  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాంతం పేరు మార్పుపై ఆయా పార్టీల వైఖరేంటో చెప్పాలంటూ నిలదీశారు. సత్యకుమార్ వ్యాఖ్యల్లో వివాదమేముందన్నారు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదమూ లేదన్నారు. జిన్నా సెంటర్ పేరును మార్చకుంటే ఆ టవర్ ను తాము కూల్చేస్తామన్నారు.  దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, రాష్ట్ర రాజధానిలో మార్చలేమా? అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే సెంటర్ పేరును మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్