ఏపీ: కొత్తగా 130 మందికి పాజిటివ్.. విశాఖలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

By Siva Kodati  |  First Published Dec 30, 2021, 6:05 PM IST

ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు . నిన్న ఒక్కరోజు 97 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,081 మంది చికిత్స పొందుతున్నారు
 


ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 130 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,74,084కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,493కి చేరుకుంది. 

కోవిడ్‌తో నిన్న నెల్లూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 97 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,58,510కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 33,188 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,12,95,287కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1081 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 18, తూర్పుగోదావరి 14, గుంటూరు 7, కడప 7, కృష్ణ 18, కర్నూలు 2, నెల్లూరు 6, ప్రకాశం 5, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 30, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 8 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

Latest Videos

undefined

ఇక, దేశంలో గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది క్రితం రోజు నమోదైన 9,195 కేసులతో పోలిస్తే.. 43 శాతం ఎక్కువ. ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,22,040కి పెరిగింది. తాజాగా కరోనాతో 268 మృతిచెందగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,42,58,778‬కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉంది.

 

: 30/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,74,084 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,510 మంది డిశ్చార్జ్ కాగా
*14,493 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,081 pic.twitter.com/xABC70m1rX

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!