పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు.. వెల్లడించిన ఏఎస్పీ శ్రీనివాస్

Published : May 23, 2022, 04:18 PM IST
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు.. వెల్లడించిన ఏఎస్పీ శ్రీనివాస్

సారాంశం

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అనంతబాబు పోలీసు కస్టడీలోనే ఉన్నారని కాకినాడ ఏఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. 

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అనంతబాబు పోలీసు కస్టడీలోనే ఉన్నారని కాకినాడ ఏఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇవాళే రిమాండ్ ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  ఇక, మరోవైపు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీకి పోలీసులు సమాచారం అందించారు. 

మరోవైపు పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు నేరం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యంను కొట్టింది నిజమేనని.. చంపాలని అనుకోలేదని సుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. తన వ్యక్తిగత విషయాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నాడని.. వ్యక్తిగత విషయాలు అందరికి చెబుతానని సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్ చేశాడని అనంతబాబు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, పోలీసులు ఈరోజు సాయంత్రం ఎమ్మెల్సీ అనంతబాబును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. 

మరోవైపు సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులు సుబ్రహ్మణ్యం, పవన్‌లను కూడా పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు.  దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. సుబ్రహ్మణ్యం తల్లి, పవన్ సోదరి పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి తమవారిని చూపించాలని కోరారు. ఇంటి వద్ద ఉన్నవారిని పోలీసులు తీసుకొచ్చారని.. వారికి ఏం తెలియదని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్