ఆ విషయంలో చర్చకు సిద్దమా?: మంత్రి బొత్స సత్యనారాయణకు సోము వీర్రాజు సవాలు..

By Sumanth KanukulaFirst Published May 23, 2022, 3:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ది శూన్యం అని విమర్శించారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. 
 

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనని.. దీనిపై దమ్ముంటే చర్చకు వస్తారా అని సవాలు విసిరారు. రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ది శూన్యం అని విమర్శించారు. విజయనగరం జిల్లాలో గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై వైసీపీ నాయకులు ప్రయాణిస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్దిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిందన్నారు. 
ఏపీలో ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. అటువంటి బీజేపీకే వచ్చే ఎన్నికల్లో గెలిచే అర్హత ఉందన్నారు. 

ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని ..  ఆ కలను నేరవేర్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోని రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి నూతన విగ్రహాన్ని ప్రతిష్టింప చేసిన ఘనత బీజేపీదేనని  చెప్పారు. 

click me!