రాష్ట్రంలో బీసీ నేతలతో బస్సు యాత్ర: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

Published : May 23, 2022, 03:23 PM ISTUpdated : May 23, 2022, 03:29 PM IST
 రాష్ట్రంలో బీసీ నేతలతో బస్సు యాత్ర: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

సారాంశం

రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులతో బస్సు యాత్రను నిర్వహిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.  


అమరావతి: త్వరలోనే రాష్ట్రంలో బీసీ నాయకులతో Bus Yatraను చేపడుతామని  ఏపీ రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.సోమవారం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Botsa Satynarayana అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం నేత R.Krishnaiahను  రాజ్యసభకు పంపితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. బీసీ సమస్యలను సమర్ధవంతంగా పార్లమెంట్ లో ఆర్. కృష్ణయ్య వినిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడి వారన్నది కాదు ఎంత సమర్ధవంతుడో చూడాలని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్. కృష్ణయ్యను Rajya Sabha కు పంపడంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

MLC Anantha Babu విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వ్యవహరం పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.ఈ విషయమై ఇప్పటికే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. అంతేకాదు ఈ కేసు విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. చట్టం ముందు అందరూ కూడా సమానులేనని ఆయన చెప్పారు.

also read:విద్యాశాఖ బొత్సకు ఇష్టంలేదు... అసంతృప్తితోనే...: టెన్త్ పేపర్ లీకేజీపై జలీల్ ఖాన్ సంచలనం

ఏపీ రాష్ట్రం నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు గత వారంలో YCP అభ్యర్ధులను ప్రకటించింది. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి, మరో రెండు స్థానాలను బీసీ సామాజిక వర్గాలకు  కేటాయించారు.  ఏపీ కేబినెట్ లో మొత్తం 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే జగన్ కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి పదవుల  కేటాయింపులలో వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లను జగన్ కేటాయించారు.

2014 ఎన్నికలకు ముందు ఆర్. కృష్ణయ్య టీడీపీలో చేరారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని కూడా చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు.  ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలోనే ఆర్.కృష్ణయ్య కు Congress పార్టీ టికెట్ ఇచ్చింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

గత కొంత కాలంలో ఆర్. కృష్ణయ్య వైఎస్ జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీసీలకు అనుకూలంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆర్. కృష్ణయ్యకు వైసీపీ  రాజ్యసభ సీటును కేటాయించింది. బీసీ  నేతగా ఉన్న కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయిస్తే రాజకీయంగా కూడా బీసీీల్లో ప్రభావం ూపే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని వైసీపీ చీఫ్ జగన్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపారు. అయితే కృష్ణయ్య తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని టీడీపీ విమర్శలు చేస్తుంది. ఏపీలో ఎవరూ లేన్నట్టుగా తెలంగాణ వారిని ఏపీ నుండి రాజ్యసభకు పంపుతున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే