వైఎస్ఆర్‌ను విమర్శిస్తే మర్యాద ఉండదు: తెలంగాణ నేతలపై రోజా ఫైర్

Published : Jul 02, 2021, 11:37 AM IST
వైఎస్ఆర్‌ను విమర్శిస్తే మర్యాద ఉండదు: తెలంగాణ నేతలపై రోజా ఫైర్

సారాంశం

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 

చిత్తూరు: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ వ్యవహరిస్తే సహించమన్నారు.  తాగునీటిని విద్యత్ ఉత్పత్తి కోసం ఉపయోగించడం సరైంది కాదన్నారు. కరోనా సమయంలో చంద్రబాబునాయుడు ఎక్కడ దాక్కొన్నారని ఆమె ప్రశ్నించారు.  చంద్రబాబు దొంగదీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం  చోటు చేసుకొంది. 

also read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం సాగుతోంది. రెండు రాష్ట్రాలు పరస్పరం పిర్యాదులు చేసుకొన్నాయి. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.తమకు న్యాయం చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే కోరిన విషయం తెలిసిందే.  కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాలు తమ పోలీసులను మోహరించారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?