కృష్ణా జల వివాదం.. జోక్యం చేసుకోండి: మోడీ, జలశక్తి మంత్రులకు జగన్ లేఖలు

By Siva KodatiFirst Published Jul 1, 2021, 9:04 PM IST
Highlights

తెలంగాణతో జలవివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాశారు. జల జగడంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు

తెలంగాణతో జలవివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాశారు. జల జగడంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. కేఆర్ఎంబీ పరిధిని ఫిక్స్ చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌ల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని జగన్ కోరారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు ఉల్లంఘించిందని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. తెలంగాణ ఉల్లంఘనలపై గతంలో కేఆర్ఎంబీకి రాసిన లేఖలను ముఖ్యమంత్రి జగన్ జతపరిచారు. 

కృష్ణా నదీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, ఆర్డీఎస్ కాలువ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది. నిత్యం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద నల్గొండ జిల్లా పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read:ఏపీ-తెలంగాణ జలవివాదం... రంగంలోకి ఇరు రాష్ట్రాల పోలీసులు

ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ స్వయంగా సాగర్‌ జలాశయం వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఏపీ - తెలంగాణ అంతర్‌ రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

click me!