మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. బెదిరింపులు..!

By telugu news teamFirst Published Jul 2, 2021, 7:50 AM IST
Highlights

సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శనానికి వచ్చిన సందర్భంలో మహిళా భక్తులు స్నానాలు చేస్తుండగా.. ఫోటోలు తీసి తనకు పంపాలంటూ ఆలయ అర్చకుడి బంధువైన ఓ బాలుడికి కానిస్టేబుల్ పని అప్పగించాడు.

గుడిలో దైవదర్శనానికి వచ్చి..  స్నానాలు చేస్తున్న మహిళా భక్తులను రహస్యంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. అనంతరం.. ఆ ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని చూపించి సదరు మహిళలను బెదిరించడం మొదలుపెట్టారు. అలా బెదిరించిన వారిలో ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. కాగా.. కానిస్టేబుల్ సహా.. మరో వ్యక్తి, ఓ మైనర్ బాలుడు ని కూడా అరెస్టు  చేశారు. ఈ సంఘటన పెద్దాపురంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దాపురం సమీపంలోని పాండవులమెట్టపై ఉన్న వైర్ లెస్ రిపీటర్ సెంటర్ లో కనకారావు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అక్కడి సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శనానికి వచ్చిన సందర్భంలో మహిళా భక్తులు స్నానాలు చేస్తుండగా.. ఫోటోలు తీసి తనకు పంపాలంటూ ఆలయ అర్చకుడి బంధువైన ఓ బాలుడికి కానిస్టేబుల్ పని అప్పగించాడు.

ఆ బాలుడు అదేవిధంగా ఫోటోలు తీసి కానిస్టేబుల్ కి పంపించాడు. అతను వాటిని దళిత సంఘం నాయకుడు రొక్కం శ్యామ్ దయాకర్ కు పంపించాడు. వాటి ఆధారంగా హెడ్ కానిస్టేబుల్, దళిత సంఘం నాయకుడు  దేవాలయం నిర్వాహకుల కుటుంబాన్ని బ్లాక్ మొయిల్ చేశారు.

రూ.5లక్షలు ఇవ్వాలంటూ వారిని బెదిరించడం మొదలుపెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

click me!