రోజా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఆ భయంతోనే వాళ్ళ కాళ్లు పట్టుకుని బీజేపీలో చేరాడు

By Nagaraju penumala  |  First Published Nov 22, 2019, 3:19 PM IST

వైసీపీ ప్రభుత్వం యెుక్క సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల విమర్శలు చూస్తుంటే వారి చిన్నమెదడు చితికినట్లు ఉందంటూ రోజా విరుచుకుపడ్డారు. 


తిరుపతి: బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా. జైలు కెళ్లాల్సి వస్తుందనే భయంతో బీజేపీ నేతల కాళ్లుపట్టుకుని ఆ పార్టీలో చేరిన సుజనా చౌదరి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. 

వైసీపీ ఎంపీలు బీజేపీలోకో లేక మరే ఇతర పార్టీలోకో చేరాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకులకు రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టి ఏపీలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందని ముందుగానే ఊహించిన సుజనా బీజేపీలో చేరిపోయారని ఆ విషయం ప్రజలందరికీ తెలుసునంటూ హెచ్చరించారు. 

Latest Videos

సుజనా చౌదరిలా వైసీపీ ఎంపీలు ఎవరూ భరితెగించలేదన్నారు. సుజనా చౌదరిలా వైసీపీ ఎంపీలు ఎవరూ తప్పులు చేయలేదన్నారు. సుజనా చౌదరిలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారు ఎవరూ లేరన్నారు. 

ఏపీలో నీచ రాజకీయాలకు పాల్పడే చంద్రబాబు లాంటి వ్యక్తినే వైసీపీ ఎదుర్కొందని అలాంటిది సుజనాచౌదరి ఒక లెక్కా అంటూ ఘాటుగా హెచ్చరించారు. సుజనా చౌదరితో కలిసి వేరే పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏ వైసీపీ నేతకు లేదన్నారు. 

సుజనాకి కౌంటర్: బ్యాంకు లూటీల భజన చౌదరి అంటూ రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనమేరకు తాము పనిచేస్తామంటూ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాము ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్నామని తాము ఇప్పుడు అధికారంలోకి వస్తే తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా సుజనా బీజేపీలో చేరితో మిగిలిన వారు కూడా చేరిపోతారా అంటూ నిలదీశారు రోజా. 

మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై విరుచుకుపడ్డారు రోజా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే వారికి వచ్చిన కడుపు ముంట ఏంటని నిలదీశారు. 

మేము తలచుకుంటే ఏమౌతావ్, నీకు దమ్ముంటే....: సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు ఫైర్

పేదల కోసమే సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యెుక్క సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల విమర్శలు చూస్తుంటే వారి చిన్నమెదడు చితికినట్లు ఉందంటూ రోజా విరుచుకుపడ్డారు. 

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

click me!