మగాళ్ళెవరో మడతగాళ్ళు ఎవరో 2019లోనే తేలిపోయింది..: వైసిపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 5:18 PM IST
Highlights

మగాాళ్లెవరో మడతగాళ్లు ఎవరో 2019 ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజలు తేల్చారంటూ తెలుగుదేశం పార్టీపై గురజాల వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

గుంటూరు: రేపు 15వ తారీకున జరుగే మున్సిపల్ ఎన్నికల్లో గురజాల, దాచేపల్లి మునిసిపాలిటీలలో 40 వార్డులకు 40 వార్డులు గెలిచి చూపిస్తామని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏంటో చూపించామని... ప్రజలే మగాళ్ళెవరో మడత గాళ్ళు ఎవరో నిర్ణయించారంటూ ఎమ్మెల్యే kasu mahesh reddy సంచలన వ్యాఖ్యలు చేసారు. 

గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా revanth reddy తో డబ్బులు పంపించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోలేదా? అదేమైనా ప్రతిపక్షాల కుట్ర అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న దాచేపల్లి పట్టణంలో డబ్బులు, మద్యం పంచుతూ పట్టుబడిన ఒకరిద్దరు టిడిపికి చెందిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి YSRCP కి ఏంటి సంబంధం? అని మహేష్ రెడ్డి అన్నారు. 

''దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. అలాంటిది దమ్ము ధైర్యం గురించి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది'' అన్నారు. 

వీడియో

'' రాష్ట్రంలో ఏ ఎలక్షన్ కి వెళ్ళిన వైసిపినే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో వైఎస్ఆర్సిపి పదిలంగా ఉంది అని అర్థం. యుద్ధాలు చేస్తాం, మీసాలు  తిప్పుతాం,  తొడలు చారుస్తాం అనే మాటలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం కోసం మాత్రమే టిడిపి వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్. వాళ్లు సోషల్ మీడియా కోసమే ప్రచారం చేస్తారు. మేము ప్రజల కోసం అభివృద్ధి కోసం మాట్లాడతాం'' అన్నారు.

read more  మంత్రాలకు చింతకాయలు రాలవు... జనాన్ని బెదిరిస్తే ఓట్లు రావు బాబూ: విజయసాయిరెడ్డి విమర్శలు

''1996 నుండి ఎన్నికల్లో డబ్బులు పంచె సంస్కృతి చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈరోజు యావత్ రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాలిటీలుగా చేశాం. మీరు కోర్టులకు వెళ్లి ఆపాలని చూశారు... అలాంటిది ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని  ఓట్లు అడుగుతారు'' అని వైసిపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మండిపడ్డారు. 

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ,533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ నెల 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి ఈ నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.

ఈ క్రమంలో గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు, పోలింగ్ బూత్, ఓటర్లకూ పోలీసులతో పూర్తి స్థాయి భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలని, పూర్తిస్థాయి భద్రతను అందించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఎన్నికల తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా టెలికాస్ట్ చేయాలని ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

 

 
 

click me!