ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం: ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్

Siva Kodati |  
Published : Dec 05, 2020, 06:52 PM IST
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం: ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్

సారాంశం

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారు అంబటి. అసెంబ్లీలో చేసిన కోవిడ్ టెస్టులో రాంబాబుకు కోవిడ్ నిర్థారణ అయ్యింది

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారు అంబటి. అసెంబ్లీలో చేసిన కోవిడ్ టెస్టులో రాంబాబుకు కోవిడ్ నిర్థారణ అయ్యింది.

గత జూలైలో అంబటి తొలిసారి కరోనాకు గురయ్యారు. యాంటీజెన్ టెస్టులో నెగిటివ్, పీసీఆర్ఐ టెస్టులో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ బారినపడ్డారు.

మరోవైపు రీ ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు అంబటి. కాగా, శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 63,406 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,70,675కి చేరింది.
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు