టీడీపీకి ఆంధ్రాలో కూడా తెలంగాణ రిజల్టే.. బాబు వణికిపోతున్నాడు : విజయ్ సాయి రెడ్డి

By AN TeluguFirst Published Dec 5, 2020, 2:57 PM IST
Highlights

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆంధ్రలో చంద్రబాబుకు చిచ్చుపెడుతున్నాయి. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ నాయకులు జోస్యాలు చెబుతున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆంధ్రలో చంద్రబాబుకు చిచ్చుపెడుతున్నాయి. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ నాయకులు జోస్యాలు చెబుతున్నారు. 

బల్దియా ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీచేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది టీడీపీ. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. 

'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీచేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రీకొడుకులు, మద్ధతుదారులైన సినీనటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతుందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్‌ ఇలాగే ఉంటుంది' అంటూ ట్వీట్‌ చేశారు.  

'అమూల్‌ రాకతో వేల కోట్ల హెరిటేజ్‌ డెయిరీ సామ్రాజ్యం కుప్పకూలుతుందని వణికిపోతున్నాడు బాబు. దేశంలో అతిపెద్ద సహకార డెయిరీ అమూల్‌పై పార్టీ నేతలతో విషం చిమ్మిస్తున్నాడు. కిందపడి ఎంతలా కొట్టుకున్నా.. పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండేళ్లలో అగ్రస్థానానికి దూసుకుపోతుంది' అంటూ వరుస ట్వీట్లు చేశారు.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated Dec 5, 2020, 2:57 PM IST