లోకేశ్ వచ్చాడు.. సైకిల్ తునాతునకలైంది, టీడీపీకి నూకలు చెల్లాయి: అంబటి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 26, 2021, 04:43 PM IST
లోకేశ్ వచ్చాడు.. సైకిల్ తునాతునకలైంది, టీడీపీకి నూకలు చెల్లాయి: అంబటి వ్యాఖ్యలు

సారాంశం

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు షాకిచ్చారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు షాకిచ్చారని ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పంలో తిరుగుతున్నారని అంబటి సెటైర్లు వేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కుప్పంకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని రాంబాబు నిలదీశారు.

కుప్పంలో ఓడింది ప్రజాస్వామ్యం కాదని.. చంద్రబాబేనని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని.. అధికారంలో వున్నప్పుడు మేనిఫెస్టో అమలు చేయని టీడీపీ, ఇప్పుడు మేనిఫెస్టో ఎలా అమలు చేస్తుందని రాంబాబు ప్రశ్నించారు.

Also Read:కుప్పంలో బాబుకు షాక్: జూ. ఎన్టీఆర్ ను ప్రచారానికి తేవాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్

లోకేశ్ వచ్చాకే సైకిల్ తునాతునకలైందని ఆయన సెటైర్లు వేశారు. మున్సిపల్ ఎన్నికలను కూడా పట్టించుకోకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకోవాల్సిన దుస్థితి చంద్రబాబు పట్టిందని అంబటి విమర్శించారు. కుప్పానికి ఏమీ చేయలేదని చంద్రబాబే ఒప్పుకున్నారని రాంబాబు ఆరోపించారు. కుప్పం, చంద్రగిరి అయిపోయిందని, చంద్రబాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని ఆయన నిలదీశారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు