కుప్పంలో బాబుకు షాక్: జూ. ఎన్టీఆర్ ను ప్రచారానికి తేవాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్

Published : Feb 26, 2021, 03:45 PM IST
కుప్పంలో బాబుకు షాక్: జూ. ఎన్టీఆర్ ను ప్రచారానికి తేవాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్

సారాంశం

చంద్రబాబునాయుడికి కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల నుండి అనుహ్యమైన డిమాండ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని కోరారు.

కుప్పం: చంద్రబాబునాయుడికి కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల నుండి అనుహ్యమైన డిమాండ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని కోరారు.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ 14 స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొంది. దీంతో చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనకు ఈ నెల 25న కుప్పం టూర్ కు వెళ్లారు.

మూడు రోజుల పాటు కుప్పంలో పలు మండలాల్లో బాబు పర్యటిస్తారు. కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

శుక్రవారం నాడు శాంతిపురంలో చంద్రబాబునాయుడు రోడ్ షో లో టీడీపీ కార్యకర్తల నుండి అనుహ్యమైన డిమాండ్ వచ్చింది. 

ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలని ఓ కార్యకర్త చంద్రబాబునాయుడిని కోరారు.

అంతేకాదు కుప్పానికి ఎన్టీఆర్ తో ప్రచారం చేయించాలని మరో కార్యకర్త కోరారు. ఇతర కార్యకర్తలు కూడ వీరితో గొంతు కలిపారు.

కార్యకర్తల నుండి వచ్చిన డిమాండ్ విషయమై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే 2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల సభను ముగించుకొని హైద్రాబాద్ కు వస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఆసుపత్రి నుండే ఓ వీడియోను రికార్డు చేసి టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో రెండోసారి వైఎస్ఆర్  సీఎంగా ఎన్నికయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?