సీఎం.. సీజేఐకి ఫిర్యాదు చేస్తే వార్త కాదా: ఆ ‘ రెండు’ పత్రికలంటూ అంబటి ఫైర్

By Siva KodatiFirst Published Oct 13, 2020, 7:54 PM IST
Highlights

ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లాం నిర్వహించిన అత్యంత కీలకమైన ప్రెస్‌మీట్‌ను కొన్ని ఛానెళ్లు ప్రసారం చేయలేదన్నారు వైసీపీ  ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లాం నిర్వహించిన అత్యంత కీలకమైన ప్రెస్‌మీట్‌ను కొన్ని ఛానెళ్లు ప్రసారం చేయలేదన్నారు వైసీపీ  ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

ఈ మీడియా సమావేశానికి అన్ని వార్తా పత్రికలు, ఛానెళ్లు హాజరయ్యాయని.. ఈ సందర్భంగా అజేయ కల్లాం.. జస్టిస్ రమణ, ఆయన శిష్యుడు దమ్మాలపాటి శ్రీనివాస్ పై కీలక వివరాలు అందించారని తెలిపారు.

అయితే అది విషయమే కాదన్నట్లు కొన్ని పత్రికలు నొక్కేసాయని అంబటి ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సుప్రీం సీజే కి ఫిర్యాదు చేస్తే వార్త కాదా అని ఆయన ప్రశ్నించారు.

జాతీయ పత్రికలు, ఛానెల్స్ ప్రధాన వార్తగా కవర్ చేశాయని రాంబాబు వెల్లడించారు. మన తెలుగు మీడియా మాత్రం అది వార్తే కాదన్నట్లు వ్యవహరించిందని అంబటి ఎద్దేవా చేశారు.

జాతీయ మీడియా ముఖ్య వార్తగా భావించినదాన్ని ఎందుకు నొక్కేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. ఆ రెండు పత్రికలు ఎందుకు దీన్ని నొక్కేయాలని చూస్తున్నాయి.. దీని వెనుక ఏమీ కుట్ర దాగి వుందని అంబటి నిలదీశారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే చేశారు కానీ...ఏమీ చేయలేకపోయారని ఆయన గుర్తుచేశారు. జగన్ సీజేకి లేఖ రాయడం మీకు నచ్చకపోవచ్చు...కానీ వార్త రాయాలి కదా అని అంబటి హితవు పలికారు.

ఇలా మీడియా పేరు చెప్పుకుని కుట్ర చేసే పత్రికలు కొని చదవాలా..? అని దుయ్యబట్టారు. వార్త రాయరు కానీ...మరుసటి రోజు చర్చ పెడతారని సెటైర్లు వేశారు. వార్తనే ప్రచురించలేని వారు జగన్ పై కంటెంప్ట్ అంటూ రాసే అర్హత మీకు ఎక్కడిదని రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబుకు కోపం వస్తుందని దాచిపెడుతున్నారా..ఒక వర్గం,  చంద్రబాబును కాపాడటానికో రాసేవి పత్రికా స్వేచ్ఛ కాదని అంబటి వ్యాఖ్యానించారు. 
 

click me!