కొత్తగా 4,622 మందికి పాజిటివ్: ఏపీలో 7,63,573కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Oct 13, 2020, 06:27 PM ISTUpdated : Oct 13, 2020, 06:30 PM IST
కొత్తగా 4,622 మందికి పాజిటివ్: ఏపీలో 7,63,573కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నెమ్మదించాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,622 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కేసుల సంఖ్య 7,63,573కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నెమ్మదించాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,622 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కేసుల సంఖ్య 7,63,573కి చేరింది.

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,291కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 5,715 మంది ఆసుపత్రుల నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,14,427కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 42,855 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 72,082 శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 67,02, 810కి చేరింది. కాగా నిన్న అనంతపురం 164, చిత్తూరు 705, తూర్పు గోదావరి 691, గుంటూరు 391, కడప 317, కృష్ణ 416, కర్నూలు 88, నెల్లూరు 228, ప్రకాశం 442, శ్రీకాకుళం 101, విశాఖపట్నం 168, విజయనగరం 159, పశ్చిమ గోదావరిలలో 752 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు 7, కృష్ణ 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త
AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu