బ్రేకింగ్ న్యూస్... కరోనా బారినపడ్డ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

By Arun Kumar PFirst Published Sep 9, 2020, 6:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఈ మహమ్మారి బారినపడ్డారు. 

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యులనే కాదు వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవ్వరినీ కరోనా వదిలిపెట్టడం లేదు. ఇలా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా అధికార వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) కూడా ఈ జాబితాలో చేరిపోయారు. 

ఎమ్మెల్యే ఆర్కే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇటీవల ఆయనను కలిసిన వారు కూడా కరోనా నిర్దారణ టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆర్కే ఆరోగ్యంగానే వున్నాడు కాబడ్డి హోంక్వారంటైన్ లో పెట్టినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. 

read more  11వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం... నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

ఇక రాష్ట్రవ్యాప్తంగా  కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం ఏపీ వైద్యఆరోగ్య శాఖ వెలువరించిన కరోనా బులెటిన్ లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10,601 కోవిడ్ కేసులు  నమోదైనట్లు ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కి చేరింది.  అలాగే కొత్తగా 73 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్ కేసులున్నాయి. 4,15,765 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 గుంటూరులో 10, అనంతపురం 8, చిత్తూరు 8, కడప 7, ప్రకాశం 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణ 5, పశ్చిమ గోదావరి 5, శ్రీకాకుళం 3, కర్నూలు 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. అలాగే అనంతపురం 441, చిత్తూరు 1,178, తూర్పు గోదావరి 1,426, గుంటూరు 702, కడప 801, కృష్ణ 389, కర్నూలు 514, నెల్లూరు 1042, ప్రకాశం 1,457, శ్రీకాకుళం 505, విజయనగరం 598, పశ్చిమ గోదావరిలలో 1,122 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 11,691 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

click me!