ఏపీలో భూముల సర్వే: అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

By narsimha lodeFirst Published Sep 9, 2020, 4:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీ సర్వే విషయాన్ని అధ్యయనం చేసేందుకుగాను మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 జనవరి నుండి భూముల రీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీ సర్వే విషయాన్ని అధ్యయనం చేసేందుకుగాను మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 జనవరి నుండి భూముల రీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను భూముల సర్వేను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

భూ పరిపాలన, ల్యాండ్ , టైటిల్స్, సమర్ధ నీటి నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనున్నట్టుగా బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో డిప్యూటీ సీఎం (రెవిన్యూ), ఆర్ధిక, వ్యవసాయ శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు.  ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా భూముల సర్వే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.ఏడాదిలోపుగా సర్వేను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ గతంలో రాష్ట్రంలో భూములను సర్వే చేసింది. తాజా సర్వే ఆధారంగా రెవిన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఇతే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడ చేయనుందని సమాచారం.

click me!