వితంతువులకు పెన్షన్ల నిలిపివేత: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

By narsimha lodeFirst Published Sep 9, 2020, 5:12 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు బుధవారం నాడు సీరియస్ కామెంట్స్ చేసింది. వితంతువులకు పెన్షన్లు నిలిపివేయడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు బుధవారం నాడు సీరియస్ కామెంట్స్ చేసింది. వితంతువులకు పెన్షన్లు నిలిపివేయడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

వితంతు పెన్షన్లు నిలిపివేయడంపై ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రాజకీయ కారణాలతోనే పెన్షన్లు నిలిపివేశారనే కేసులో ప్రభుత్వం  దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఏ మహిళా కూడ భర్త ఉన్నప్పటికీ వితంతువునని చెప్పదని కోర్టు అభిప్రాయపడింది. ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు.  వితంతువులు అబద్దాలు చెబుతున్నారనడంపై హైకోర్టు మండిపడింది.

ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం వితంతువుల ఆర్ధిక  ఇబ్బందులను కొంతవరకు తీరుస్తోందని కోర్టు అభిప్రాయపడింది. పుష్కరాలకు కోట్లాదిరూపాయాలు ఖర్చు చేయాలని ఎవరు అడిగారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 

పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని ఎవరూ కూడ కాదనలేరన్నారు. పెన్షన్లుకు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పాత పెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో కూడ పెన్షన్లు కూడ చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.కోట్లు వెచ్చించి ప్రభుత కార్యాలయాలకు రంగులు వేయాలని ఎవరైనా అడిగారా? అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 

click me!