కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల : వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 2, 2024, 5:04 PM IST
Highlights

షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని.. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు.

దాడి వీరభద్రరావు వైసీపీని వీడటంపై స్పందించారు ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు షర్మిల మధ్య నేను ఎలాంటి రాయబారాలు చేయలేదన్నారు.  నెల రోజుల తరువాత విజయమ్మని కలిసేందుకు హైదరాబాద్ వెళ్ళానని.. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని.. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని.. షర్మిల కాంగ్రెస్‌లో చేరినా మాకు ఇబ్బంది లేదని ఆయన వెల్లడించారు. 

కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారని .. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీనీ గెలిపిస్తాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని.. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు వున్నాయని.. దాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దాడి రాజీనామా చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని.. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమన్నారు. టిక్కెట్ లేని వారికి వేరే విధంగా అవకాశం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

చంద్రబాబును దత్తపుత్రుడిని  సీఎం చేసేందుకు ఒ వర్గం మీడియా మాపై బురద జల్లుతున్నారని.. కుట్రలు కుతంత్రాలు చేస్తూ , వైఎస్  కుటుంబ సభ్యులను బజారుకెక్కిస్తున్నారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా సీఎం జగన్‌కు నష్టమేమీ లేదన్నారు. మేమేమీ రాయబారాలు చేయాల్సిన పనిలేదని.. ప్రజలే  జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎంను  చేస్తారని పేర్కొన్నారు. సీఎం జగన్ వెంట మేమంతా ఉంటాం ... రాబోయే రోజుల్లో జగన్‌ను సీఎంను చేసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు. చాలా స్థానాల్లో వైసీపీ నష్టపోకుండా ఉండేందుకే అభ్యర్థులను మార్చుతున్నామని జగన్ తెలిపారు. వాస్తవ పరిస్తితులను బట్టి , వేర్వేరు కారణాలతో సీట్లు మార్చుతున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకే మార్పులు చేపట్టామని తెలిపారు. ఏడాది నుంచీ మార్పుల  విషయాన్ని సీఎం జగన్  ఎమ్మెల్యేలకు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. 

పలువురు వైసీపీ  ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తన్నారని కొందరు ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిగత కారణాలతోనే కొందరు  పార్టీలు మారుతున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో అందరికీ న్యాయం చేయడం సాధ్యపడదని.. సీట్లు ఇవ్వలేని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. గెలుపు అవకాశాలను బట్టి, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మారుస్తున్నామని, ఎన్ని సీట్లలో మార్పులుంటాయన్నది  ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. 
 

click me!