వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు.. జగన్ కు ఏకవ్యాఖ్య రాజీనామా లేఖ..

By SumaBala Bukka  |  First Published Jan 2, 2024, 3:25 PM IST

రాజీనామా లేఖలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు పేరును ప్రస్తావించలేదు దాడి వీరభద్ర రావు. ఈ లేఖ కాపీలను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లకు కూడా పంపించారు. 


విశాఖ : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టుగా ఏకవ్యాఖ్య లేఖ రాశారు. ఈ లేఖను సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. దీనికంటే ముందు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు. రాజీనామా లేఖలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు పేరును ప్రస్తావించలేదు దాడి వీరభద్ర రావు. ఈ లేఖ కాపీలను సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లకు కూడా పంపించారు. 

ఆయన కుమారుడు రత్నాకర్ కు అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండగా అది వచ్చే అవకాశం లేదని సమాచారం. దీంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. దీనిమీద నేడు నిర్ణయం తీసుకున్నారు. 2014లో దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. 2019లో కూడా టికెట్ ఆశించినా దొరకలేదు. అనకాపల్లిలో కాపు నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో వేరే పేరు వినిపిస్తుండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

Telugudesham Party : కొత్త సంవత్సరంలో సరికొత్త జోష్ ... 'రా... కదలిరా' అంటూ ప్రజల్లోకి చంద్రబాబు

ఇదిలా ఉండగా, గతంలో తెలుగు దేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్ కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓటమి పాలయ్యారు. 

ఆ తరువాత పార్టీ వారిని పక్కన పెట్టింది. దాడి వీరభద్రరావు కూడా మౌనంగానే ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన ఇప్పుడు జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ సారి పవన్ కల్యాణ్ దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటి అయ్యి, సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పడది స్పష్టం కానుంది. 

click me!