ఏం చేయాలన్నా కష్టమే... దౌర్భాగ్యపు టీడీపీ, చంద్రబాబు వల్లే ఈ దుస్థితి: సజ్జల ఆగ్రహం

By Arun Kumar PFirst Published Dec 8, 2021, 1:05 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ధౌర్భాగ్యమే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ సలహాధారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. 

గుంటూరు: అమరావతి పేరుతో సాగుతున్న పాదయాత్ర (amaravati maha padayatra) ప్రజల యాత్ర కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. అసలు ఈ పాదయాత్రలో ఖర్చుచేస్తున్న కోటానుకోట్లు ఫండ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. దీన్నిబట్టే ఈ పాదయాత్ర ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట గొడవ కావాలి... దానిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) చూస్తున్నాడని సజ్జల ఆరోపించారు.  

''ప్రజలు ఇచ్చిన 151 మాడెంట్ తో ముఖ్యమంత్రి జగన్ (ys jaganmohan reddy) అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వుండాల్సిన టిడిపి (TDP) శాసనమండలిలో మందబలంతో బిల్లులను, సంస్కరణలను అడ్డుకున్నారు. ప్రజా కోర్టులో తిరస్కరించబడిన టీడీపీ ఇపుడు వ్యవస్థల మీద ఆధారపడుతోంది. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు'' అని సజ్జల మండిపడ్డారు.

''రాష్ట్రంలోని అక్కా చెల్లెల్లకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై సంపూర్ణ హక్కుల కోసం తెచ్చిన ఓటీఎస్ (one time settlement) పై బురద చల్లుతున్నారు. సొంత ఇంటి పట్టా లేనివారికి ఆ స్థలంపై పూర్తి హక్కులు కల్పిస్తుంటే  అడ్డుకుంటున్నారు. గతంలో వడ్డీ కూడా మాఫీ చేయని పెద్దమనిషి ఇప్పుడు వైసీపీ మీద విషప్రచారం చేస్తున్నారు'' అని సజ్జల పేర్కొన్నారు. 

read more  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. జగనన్న కాలనీలకు 5 శాతం స్థలం

''ఏపీ (andhra pradesh)కి పట్టిన దౌర్భాగ్యమే ఈ టీడీపీ, చంద్రబాబు. వైసిపి ప్రభుత్వం (ysrcp government) ప్రజల కోసం ఏం చేయాలన్నా కష్టంగా ఉందంటే ఎంతలా విషప్రచారం చేస్తున్నారో అర్థం చేసుకోండి. చంద్రబాబు ఆండ్ కో రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు'' అని ఆరోపించారు.

''ఏపీ ప్రజల నుండి ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ఆదరణని టీడీపీ తట్టుకోలేకపోతుంది. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పం (kuppam) నియోజకవర్గాన్ని కజ్జా చేసి కోటగా మార్చుకున్నాడు. ఆ కోటను సీఎం జగన్ ఇటీవల బద్ధలు కొట్టారు. ప్రజల పార్టీగా వైసీపీ అవతరించింది'' అన్నారు.

read more  పేద‌ల‌కు ఉచితంగా ఇళ్లు ఇవ్వాల‌నే ల‌క్ష్యంతోనే ఓటీఎస్ - ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

''వైసీపీకి అధికారం ఉన్నామనే అహంభావం ఎక్కడా లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల విషయంలో సామాజిక న్యాయం పాటించాము. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం'' అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

ఓటీఎస్ విషయంలో ప్రజలను ఎవరూ బలవంతం పెట్టడం లేదని సజ్జల అన్నారు. తమ ప్రభత్వం నామమాత్రం ఫీజుతో పేదలకు ఇళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తుందని... చంద్రబాబు విమర్శలు అర్ధరహితమైనవి సజ్జల అన్నారు. ప్రజలు సహాయ నిరాకరణ చేయాలి అని చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు సహాయనిరాకరణ అనడంపై ఆలోచన చేయాలని సూచించారు. ఓటీఎస్ పథకంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

click me!