అర్జెంట్‌గా కుర్చీ కావాలి.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసే దమ్ముందా : చంద్రబాబుకు సజ్జల సవాల్

By Siva KodatiFirst Published Mar 19, 2023, 5:46 PM IST
Highlights

175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ వైరస్ లాంటిదని , అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తోందని సెటైర్లు వేశారు. 
 

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్జెంట్‌గా అధికారం చేపట్టాలన్న ఆశతో చంద్రబాబు వున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం అవసాన దశలో వున్నారని.. సంక్షేమం అందుకున్న వారిలో ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. చంద్రబాబుతో చెప్పించుకునే స్థితిలో జగన్, వైసీపీ లేరని.. ఇక చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చే అవకాశం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. కడుపు మంటను వెళ్లగక్కడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని వాడుకున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

ఎవడి పిచ్చి వాడికి ఆనందమని... ఇప్పుడు వ్యవస్థలు నాశనం అయ్యాయని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని బండిల్స్ తీస్తే నిజాలు బయటకు వస్తాయని.. టీడీపీ వైరస్ లాంటిదని , అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తోందని సెటైర్లు వేశారు. పశ్చిమ రాయలసీమ వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని.. ఒక్క బండిల్‌లోనే 6 ఓట్లు తేడాగా కనిపించాయని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు 3 ఎమ్మెల్సీలు  గెలిచి  గవర్నర్‌ను కలవడం ఒక్కటే తక్కువన్నట్టు  మాట్లాడుతున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad: బాలకృష్ణ, చంద్రబాబుకు మంత్రి రోజా సవాలు.. 2024లో మళ్లీ వైసీపీ దెబ్బ చూపిస్తామని కామెంట్..

2019లో చెత్తబుట్టలో వేసి తొక్కడం మర్చిపోయారా .. మొత్తం ఎన్నికల్లో  ఏదైనా  ఉంటే ఆతృత తప్ప ఏమీ కనపడటం లేదని దుయ్యబట్టారు . కొత్త పార్టీ అధ్యక్షుడు మాట్లాడితే పర్లేదని.. చంద్రబాబు  వంటి వ్యక్తి  మాట్లాడటం కామెడీగా వుందన్నారు. అర్జెంట్‌గా బాబుకు  కుర్చీ కావాలని.. మీరు  రాజీనామా  చెయ్యండని మాకు  చెప్తాడని, మీరే  చెయ్యచ్చుగా అంటూ సజ్జల చురకలంటించారు. 175 స్థానాలకు బాబు  పోటీపెడతాడా అని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఈ మూడు ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమలో అధికారుల తీరును తప్పు పడుతున్నామన్నారు. టీడీపీ నాయకులు వచ్చి దబాయించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 

click me!