సీఎం ఓ సారా కాంట్రాక్టర్...ఆయనవన్నీ గెస్ట్ హౌస్ రాజకీయాలే: అంబటి

Published : Oct 15, 2018, 04:47 PM ISTUpdated : Oct 15, 2018, 04:49 PM IST
సీఎం ఓ సారా కాంట్రాక్టర్...ఆయనవన్నీ గెస్ట్ హౌస్ రాజకీయాలే: అంబటి

సారాంశం

సీఎం రమేష్ కు సంబంధించిన కంపనీలు, ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులపై వైఎస్సార్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నెంబర్ వన్ బినామీ రమేషేనని అంబటి తెలిపారు.  సారా కాంట్రాక్టర్ స్థాయి నుండి రమేష్ ఎంపీగా ఎదగడానికి ఆయన గెస్ట్ హౌస్ రాజకీయాలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత భారీ ఎత్తున ఆస్థలు సంపాదించడానికి కూడా ఇవే కారణమని అంబటి తెలిపారు.

ఇలా అక్రమంగా సంపాదించిన సీఎం రమేష్ పై ఐటీ దాడులు జరిగితే టిడిపి పార్టీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఈ ఐటీ దాడులను కూడా రాజకీయ కక్షసాధింపు చర్యలుగా చిత్రీకరిస్తున్నారిని అంబటి వ్యాఖ్యానించారు. రమేష్ మీసం తిప్పితే ఐటీ అధికారులు తొడలు కొడుతూ తనిఖీలు ఇంకా ముమ్మరం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని అంబటి అన్నారు.

సీఎం రమేశ్‌ ఏకంగా ఇంట్లోనే లాకర్లు పెట్టుకున్నారనీ....వాటికి పింగర్ ప్రింట్‌ లాక్ ఏర్పాటు చేసుకోవడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమున్నాయో...అంత రహస్యంగా వాటిని ఎందుకు దాచారో చెప్పాలని అండటి డిమాండ్ చేశారు. ఇలా ఓ బ్రోకర్, గజదొంగ మాదిరిగా రమేష్ లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారంటూ అంబటి ఘాటు విమర్శలు చేశారు.

రిత్విక్ సంస్థ  ఏనాడైనా భారీ కాంట్రాక్టులు చేపట్టిందా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బెదిరించి  సబ్ కాంట్రాక్టులు దక్కించుకోవడమే ఈ సంస్థ ఆదాయవనరులని అంబటి ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

సీఎం రమేష్ ఇంట్లో, కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

నాలుగేళ్లలో రూ.200కోట్లు చెల్లించా:సీఎం రమేష్

రెండో రోజూ ఐటి సోదాలు: వేలిముద్రల కోసం హైదరాబాద్ కు సిఎం రమేష్

నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

ప్రధాని మా అంతు చూస్తా అన్నారు...ముల్లుని ముల్లుతోనే తీస్తాం: సీఎం రమేశ్

దాడులు ఎందుకు..? పీఏసీ మెంబర్‌ హోదాలో అడిగిన రమేశ్.. మూడు రోజుల్లోనే ఐటీ రైడ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే