వైసీపికి 30 సీట్ల‌కు మించి రావ‌ట‌...

First Published Aug 8, 2017, 12:22 PM IST
Highlights
  • వైసీపికి 30 మించి సీట్లు రావన్న సీఎం చంద్రబాబు.
  • నంద్యాలలో విజయం తమదేనని ధీమా.
  • జగన్ ఉన్మాధి అన్న చంద్రబాబు

 "2019 ఎన్నికల్లో వైసీపి పార్టీకి 30 సీట్లకు మించి రావ‌ట‌..." తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య  
మంగళవారం చంద్ర‌బాబు టిడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కాన్పరెన్స్ లో నంద్యాల ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఉప ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమైనా, వైసీపి మాత్రం తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటొందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


 నంద్యాల సభలో జగన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. తన పై జగన్ చేసిన వ్యాఖ్యలే అతని ఉన్మాద స్థితిని తెలియజేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తాను అధికారంలో లేనప్పుడే శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని... అధికారంలోకి వస్తే జగన్ మరింత రెచ్చిపోతాడని చంద్ర‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు .


   ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పాల‌క‌ప‌క్షానికి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేయాల్సిన భాద్యల ఉందన్నారు, అందుకు ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌రిష్కార దిశ‌గా పాలుపంచుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కానీ జ‌గ‌న్‌ అధికార కోసం నింద‌లు వేస్తున్నార‌ని, దీనితో వైసీపి క్రమంగా తన ఉనికిని కోల్పోతోందని ఆయ‌న ఎద్దేవా చేశారు.

 "నా కష్టానికి మీ శ్రమ తోడైతే శాశ్వతంగా అధికారం మనదే" అని చంద్రబాబు అన్నారు. ఇప్ప‌టి నుండే 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిడిపి ప్ర‌భుత్వం ఎప్పుడు ప్ర‌జ‌ల మంచి కోసమే పాటుప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

మూడేళ్లలో ప్రజలకు ఎన్నో చేశాం..ప్రజాదరణ మనవైపే ఉంటుందని ఆయన చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబు ఆదేశించారు.
 

click me!