బెల్టుషాపుల పై మంత్రి షాకింగ్ కామెంట్స్

Published : Aug 08, 2017, 10:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
బెల్టుషాపుల పై మంత్రి షాకింగ్ కామెంట్స్

సారాంశం

మొన్నటి వరకూ బెల్టు షాపులకు అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదని పాలకులు ఎన్ని మాటలు చెప్పారో గుర్తుంది కదా? ఇపుడు సాక్ష్యాత్తు మంత్రే చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం. రాష్ట్రలోని బెల్టు షాపులన్నీ ప్రభుత్వానికి తెలిసే నడుస్తున్నాయని అర్ధం కావటం లేదా? ప్రభుత్వ అంచనాల ప్రకారమే రాష్ట్రంలో 48 వేల బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఎప్పుడైతే బెల్టు షాపులపై మహిళలు ఆందోళన మొదలుపెట్టారో తప్పని సరిగా వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘మూడేళ్ళుగా బెల్టు షాపులను చూసీ చూడనట్లు వదిలేసాం’. ‘కానీ మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నందునే తప్పనిసరి పరిస్ధితిల్లో బెల్టు షాపులను తొలగించాల్సి వస్తోంది’...ఇవి తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ చేసిన వ్యాఖ్యలు.  వైన్ షాపు డీలర్ల సమావేశంలో మంత్రి పై వ్యాఖ్యలు చేసారు. మొన్నటి వరకూ బెల్టు షాపులకు అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదని పాలకులు ఎన్ని మాటలు చెప్పారో గుర్తుంది కదా? ఇపుడు సాక్ష్యాత్తు మంత్రే చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం. రాష్ట్రలోని బెల్టు షాపులన్నీ ప్రభుత్వానికి తెలిసే నడుస్తున్నాయన్న అర్ధం కావటం లేదా?

ప్రభుత్వ అంచనాల ప్రకారమే రాష్ట్రంలో 48 వేల బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఎప్పుడైతే బెల్టు షాపులపై మహిళలు ఆందోళన మొదలుపెట్టారో తప్పని సరిగా వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి చెప్పినట్లుగా మూడేళ్లుగా బెల్టు షాపులను ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్లుగా వదిలేసింది? ఆన్సర్ చాలా సింపుల్. 48 వేల బెల్టు షాపుల్లో అత్యధికం అధికార పార్టీ నేతలకు చెందినవి కాబట్టే. అధికారిక మద్యం షాపుల ఆదాయానికి బెల్టు షాపుల ఆదాయం అదనమన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవం ఇలావుండగా మహిళల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం చేసిన హడావుడి కూడా జనాలు తెలిసిందే.

ఇపుడు కూడా తప్పనిసరి పరిస్ధితిల్లోనే వాటిని తొలగించాల్సి వచ్చిందని ఘనత వహించిన మంత్రి స్పష్టంగా చెప్పటం గమనార్హం. అసలే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్. దాంతో రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్న ఆందోళనతోనే బెల్టు తీయాలని అనుకున్నది ప్రభుత్వం. అంతేకానీ మహిళలపై ప్రేమతో మాత్రం కాదన్నది మంత్రి ప్రకటనలోని అంతరార్ధం. నూతన మద్యం పాలసీ ప్రకారం ఇంకా 25 శతం మద్యం షాపులు, బార్లు ఏర్పాటే కాలేదని మంత్రి బాధపడిపోతున్నారు. అవెందుకు ఏర్పాటు కాలేదంటే, మహిళల అభ్యంతరాల వల్లే అని కూడా మంత్రి సమాధానం చెబుతున్నారు. ఏర్పాటైన మద్యం దుకాణాలను తొలగించాలని 7 వేల ఫిర్యాదులు అందినట్లు కూడా మంత్రే చెబుతున్నారు లేండి.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu