వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతా ఇంప్లీడ్ పిటిషన్

By narsimha lode  |  First Published Mar 10, 2023, 11:19 AM IST

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  తెలంగాణ హైకోర్టులో  శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు  చేశారు.  వైఎస్  అవినాష్ రెడ్డి పిటిషన్ లో తన వాదనలు కూడా వినాలని  ఆమె  ఆ పిటిషన్ లో  కోరారు. 


హైదరాబాద్: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  మరో ట్విస్ట్  చోటు  చేసుకుంది.  కడప ఎంపీ  అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ లో   వైఎస్ సునీతారెడ్డి  ఇంప్లీడ్  పిటిషన్ ను శుక్రవారం నాడు దాఖలు  చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  గురువారంనాడు  తెలంగాణ హైకోర్టులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  పిటిషన్ దాఖలు  చేశారు. సీబీఐ విచారణ  సమయంలో  ఆడియో, వీడియో రికార్డు  చేయాలని కోరారు. అంతేకాదు  న్యాయవాది సమక్షంలో  విచారణ  జరగాలని  కోరారు.పారదర్శకంగా  విచారణ జరగడం లేదని  అవినాష్ రెడ్డి  ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.

Latest Videos

అయితే  కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ పై  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  ఇంప్లీడ్  పిటిషన్ ను దాఖలు  చేశారు. అవినాష్ రెడ్డి  పిటిషన్ లో  తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు  చేసిన నేపథ్యంలో తన వాదనలను కూడా వినాలని ఆ పిటిషన్ లో  ఆమె కోరారు.
 

click me!