మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారంనాడు సీబీఐ విచారణకు హాజరయ్యారు.హైద్రాబాద్ కోఠిలో గల సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. సీబీఐ విచారణ విషయమై నిన్ననే వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పిటిషన్ లో కోరారు. అంతేకాదు తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు. శుక్రవారం నాడు ఉదయం తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇంకా ఆదేశాలు ఇవ్వనందున విచారణకు హాజరైనట్టుగా అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పారు. గతంలో రెండు దఫాలు వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మూడో సారి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
2019 మార్చి 19వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు.. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ సమయంలో చద్రబాబు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఏర్పాటైంది. జగన్ సర్కార్ కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణపై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి తో పాటు పలువురు సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
also read:వైఎస్ వివేకా హత్య: సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ
ఈ కేసులో పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో వైపు ఈ కేసు విచారణను ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గతంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణలో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.