వైఎస్ వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

By narsimha lodeFirst Published Sep 4, 2023, 10:58 AM IST
Highlights

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  నిందితులు వైఎస్  భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ల బెయిల్ పిటిషన్లను  తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి  బెయిల్ పిటిషన్లను  తిరస్కరించింది  తెలంగాణ హైకోర్టు.ఈ ఏడాది ఏప్రిల్  16న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ అధికారులు  అరెస్ట్  చేశారు.  పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు  అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ కంటే ముందే  ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  వైఎస్ భాస్కర్ రెడ్డి గతంలో  సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే  ఈ బెయిల్ పిటిషన్ ను  కోర్టు కొట్టివేసింది. దీంతో  వైఎస్ భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు  ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి కూడ  హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి,  ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను  హైకోర్టు  ఇవాళ తిరస్కరించింది.ఈ ఏడాది జూన్ 9వ తేదీన  వైఎస్ భాస్కర్ రెడ్డి  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను  సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ భాస్కర్ రెడ్డి. అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత  వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లను  హైకోర్టు తిరస్కరించింది.

ఈ ఏడాది జూన్ 9వ తేదీన  వైఎస్ భాస్కర్ రెడ్డి  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను  సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ భాస్కర్ రెడ్డి. అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత  వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లను  హైకోర్టు తిరస్కరించింది.

2019 మార్చి  14న   పులివెందులలోని తన నివాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్యకు గురయ్యారు.ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది.  గతంలో చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న సమయంలో  ఈ హత్య కేసు విచారణకు  ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు  స్వీకరించిన తర్వాత మరో సిట్ ను  ఏర్పాటు చేసింది.   అయితే  ఈ కేసు విచారణను  సీబీఐతో చేయించాలని   వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  వైఎస్ సునీతా రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి లు  ఏపీ హైకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు.

also read:వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..

ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ విచారణకు  ఆదేశాలు జారీ చేసింది.    ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఇప్పటికే  పలు కీలక సాక్ష్యాలను  సేకరించినట్టుగా  సీబీఐ  కోర్టుకు సమర్పించిన చార్జీషీట్లలో పేర్కొంది. మరో వైపు  ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా  కోర్టు చేర్చిన విషయం తెలిసిందే. 

  


 

click me!