మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పులివెందుల కోర్టు శివ శంకర్ రెడ్డిని 14 రోజుల రిమాండ్ విధించింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని గురువారం నాడు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. శివ శంకర్ రెడ్డికి పులివెందుల కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ ను విధించింది. బుధవారం నాడు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను పులివెందుల కోర్టులో హాజరు పర్చారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి devireddy shiva shankar reddy సన్నిహితుడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే నలుగురిపై సీబీఐ అభియోగాలన మోపింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డి లపై ఈ ఏడాది అక్టోబర్ మాసంలో సీబీఐ చార్జీషీటు దాఖలు చేసింది. సమగ్ర ఛార్జీషీటును కూడా త్వరలోనే దాఖలు చేసే అవకాశం ఉంది.
Ys Vivekananda reddy హత్య కేసులో కీలక విషయాలను cbi దర్యాప్తులో గుర్తించింది. దస్తగిరి సీబీఐ అఫ్రూవర్ గా మారాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చాడు. దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టులో సమర్పించారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. Hyderabadలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయనను హైద్రాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి తరలించి విచారించారు. ఇవాళ సాయంత్రం కడప జిల్లాలోని పులివెందుల కోర్టులో శివ శంకర్ రెడ్డిని హాజరుపర్చారు. శివ శంకర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కడప జిల్లా కేంద్ర కారాగారానికి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు తరలించారు.
also read:YS Vivekananda Reddy murder case: దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని సీబీఐ అధికారులు శివశంకర్ రెడ్డికి ఈ నోటీసు ఇచ్చారు. ఈ నెల 15న విచారణకు రావాలని కోరారు. అయితే అనారోగ్య కారణాలతో తాను హైద్రాబాద్ లో ఉన్నానని శివ శంకర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారమిచ్చారని తెలిసింది. విచారణకు రాకుండా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం హైద్రాబాద్ కు చేరుకొని శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. శివశంకర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ లో కూడా శివశంకర్ రెడ్డి పేరు ఉంది.2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే హతమార్చిన విషయం తెలిసిందే.
వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులను పట్టుకోవాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.