అందుకే కుప్పంలో చంద్రబాబుకు దేవుడి మొట్టికాయలు: ఏపీ అసెంబ్లీలో జగన్

By narsimha lode  |  First Published Nov 18, 2021, 4:10 PM IST


మహిళా సాధికారితపై జరిగిన చర్చలో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చురకలంటించారు. మంచి చేసే ప్రభుత్వానికి అడ్డు పడితే దేవుడు మొట్టికాయలు వేస్తున్నాడన్నారు. ఇందుకు కుప్పం ఫలితాలే నిదర్శనమని జగన్ చెప్పారు.


అమరావతి: తమ ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను కోర్టుకు వెళ్లి ఆపేందుకు టీడీపీ ప్రయత్నించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అందుకే కుప్పంలో టీడీపీకి దేవుడు మొట్టికాయలు వేశాడని జగన్ చంద్రబాబుకు చురకలు అంటించారు.గురువారం నాడుAp Assembly లో  మహిళా సాధికారితపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరునే ఇచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. అంటే సుమారు కోటి జనాభాకు ఇళ్ల వసతి దక్కుతుందన్నారు.ఇళ్ల పథకాన్ని కూడా కోర్టుకు పోయి అడ్డుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని నిలివివేస్తే దేవుడు చూస్తూ ఊరుకొంటాడా అని ఆయన ప్రశ్నించారు. అందుకనే కుప్పంలో Chandrababuకు మొట్టికాయలు వేశాడన్నారు. 

bac సమావేశానికి చంద్రబాబు రాలేదన్నారు. ఈ సమావేశాన్ని ఆలస్యంగా ప్రారంభించినట్టుగా Ys jagan గుర్తు చేశారు. అయితే కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు సభకు రాలేదని తమ పార్టీ వాళ్లు అంటున్నారని జగన్ చెప్పారు. ఈ చర్చలో చంద్రబాబు కూడా ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.కుప్పం ఫలితాన్ని చూసైనా చంద్రబాబులో మార్పు వస్తోందని ఆశిస్తున్నానని జగన్ అభిప్రాయపడ్డారు. నగర పంచాయితీల్లో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటు షేర్ వచ్చిందని  ఆయన చెప్పారు. ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు.పార్టీలతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందే పథకాలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో 61 లక్షల 73 వేల పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. నెలకు రూ.1500 కోట్లకు పైగా పెన్షన్లను ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు.

Latest Videos

also read:గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం జగన్

గత ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొడితే తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.36 లక్షల 70 వేల మంది మహిళలకు పెన్షన్ అందిస్తున్నామని సీఎం చెప్పారు.వైఎస్ఆర్ చేయూత పథకంతో ప్రతి ఏటా ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. అక్కా చెల్లెళ్లను ఆదుకొనేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చినట్టుగా సీఎం జగన్ తెలిపారు.పాడి పరిశ్రమ ద్వారా 3 లక్షల 40 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు.  ఈ రెండేళ్లలో మహిళా సాధికారితలో సువర్ణాధ్యాయం లిఖించామన్నారు సీఎం జగన్. మహిళలకు మంచి జరగాలని భావిస్తున్న ప్రభుత్వం తమది అని సీఎం చెప్పారు.

మహిళలకు పెద్దపీట

కేబినెట్ లో మహిళలకు పెద్దపీట వేసిన విషయాన్ని సీఎం  జగన్ గుర్తు చేశారు. చరిత్రలో తొలిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించిన చరిత్ర తమదేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని జడ్పీ చైర్మెన్లలో ఏడుగురు మహిళలే ఉన్నారన్నారు. వాలంటీర్లలో 53 శాతం మంది మహిళలే ఉన్న విషయాన్ని సీఎం చెప్పారు. దిశ చట్టం చేసి  కేంద్రం  ఆమోదం కోసం పంపిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయంలో ఉన్న 44 వేల బెల్ట్ షాపులను తీసేశామన్నారు.పర్మిట్ రూమ్‌లను కూడా తొలగించినట్టుగా సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో అత్యాచారాలు హత్యల ధర్యాప్తునకు 318 రోజులు పట్టేదన్నారు. అయితే తమ ప్రభుత్వం లో 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
 

click me!