వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన నిందితులు

By narsimha lode  |  First Published Feb 10, 2023, 11:36 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు నిందితులను  ఇవాళ  హైద్రాబాద్ నాంపల్లిలో  గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు.


హైదరాబాద్:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు నిందితులను  హైద్రాబాద్  నాంపల్లిలోని  సీబీఐ కోర్టు  శుక్రవారంనాడుహజరుపర్చారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను  హైద్రాబాద్ సీబీఐ కోర్టుకు  బదిలీ చేసింది. దీంతో  ఈ కేసు విచారణ చేస్తున్న కోర్టులో నిందితులను హజరుపర్చారు.  

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు నిందితులను  ఇవాళ  హైద్రాబాద్ నాంపల్లిలో  గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు.  ఈ కేసులో  నిందితులుగా  ఉన్న  సునీల్ యాదవ్,  ఉమాశంకర్ రెడ్డి,  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను  ప్రోటెక్షన్  వారంట్ జారీ అయింది. 

Latest Videos

కడప జైలులో  ఉన్న నిందితులను  బందోబస్తు మధ్య ఇవాళ తెల్లవారుజామున  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.  ఈ కేసులో బెయిల్ పై ఉన్న  ఎర్ర గంగిరెడ్డి,  దస్తగిరిలను  కూడా   సీబీఐ అధికారులు సమన్లు  జారీ చేశారు.  

2019 మార్చి  19వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.   ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ  జరిపించాలని  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ కేసు విచారణను  తెలంగాణకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైద్రాబాద్ లో గల   ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను  కడప నుండి  ఈ ఏడాది జనవరి  24వ తేదీన తరలించారు.  

ఈ  కేసు విచారణ ఇక నుండి హైద్రాబాద్ కేంద్రంగా జరగనుంది. దీంతో  ఈ కేసులో  జైలులో ఉన్న నిందితులను కడప నుండి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. జైలులో  ఉన్న నిందితులను హైద్రాబాద్ చంచల్ గూడ జైలులో  ఉంటారు. 

 

click me!