ఏపీలోఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు: తాడేపల్లిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్

By narsimha lodeFirst Published Nov 1, 2022, 10:29 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని  పురస్కరించుకొని  ఏపీ సీఎం  వైఎస్ జగన్ మంగళవారంనాడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహనికి సీఎం  జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీ నుండి నిర్వహించాలని  జగన్ సర్కార్  నిర్ణయం తీసుకుంది. ఈ  మేరకు 2020 లో ఏపీప్రభుత్వం జీవోను జారీ చేసింది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీనఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించేవారు. 2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా  విభజించారు. దీంతో ప్రతి ఏటా జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ  దినోత్సవాన్ని  తెలంగాణలో నిర్వహిస్తున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రఅవతరణ దినోత్సవాలపై సందిగ్ధంలో  పడింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిర్వహించినట్టుగానే నవంబర్1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

 

click me!