హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్ట సవరణకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు.
అమరావతి: హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టసవరణకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో సోమవారం నాడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరుకు బదలుగా వైఎస్ఆర్ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 21న నిర్వహించిన అసెంబ్లీ చట్ట సవరణ చేసింది.ఈ చట్ట సవరణను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఈ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
undefined
also read:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు: ఏపీ అసెంబ్లీ ఆమోదం
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడ ఈ విషయమై ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. వైద్య రంగంలో వైఎస్ఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంలో హెల్త్ యూనిర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై అసెంబ్లీ, శాసనమండలిలో టీడీపీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.