ఎన్డీఏలోకి జగన్ : కేంద్రంలో వైసీపీకి దక్కే బెర్తులివే...?

By telugu teamFirst Published Feb 15, 2020, 2:50 PM IST
Highlights

జగన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ లో చేరితే కలిగే నష్టాలేమిటి, లాభాలేమిటని బేరీజులు వేస్తూ మీడియా చానెల్స్ ఇప్పటికే ఊదరగొడుతున్నాయి. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో చేరితే వైసీపీకి ఏయే పదవులు కట్టబెట్టబోతున్నారో కూడా బయటకు వచ్చినట్టు ఒక లీకు చక్కర్లు కొడుతుంది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎన్డీయేలో చేరే అంశాన్ని వైసీపీ పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ఇలా జగన్ ఎన్డీఏవైపు చూస్తున్నారనే సంకేతాన్ని బొత్స ఇచ్చారు. 

ఎప్పటినుండో కూడా జగన్ ఎన్డీయేలో చేరతారు అనే చర్చ బలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చర్చ వచ్చినప్పటికీ కూడా అంతా జగన్ చేరడు, చేరితే కలిగే నష్టం అతనికి తెలుసు అంటూ ఆ ఊహాగానాలను కొట్టిపారేశారు. 

Also read; ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఎలోకి వెళ్తారు: బొత్స వ్యాఖ్యలపై రామకృష్ణ ఫైర్

ఇప్పుడు స్వయానా వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స ఇలాంటి ప్రకటన చేయడం, జగన్ చూపు బీజేపీవైపుగా ఉందనే విషయాన్నీ కుండబద్దలుకొట్టినట్టవుతుంది. జగన్ అందుకోసమే దెళ్హజి పర్యటనకు కూడా వెళ్లారు అనే వార్తలు కూడా జోరందుకున్నాయి. 

జగన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ లో చేరితే కలిగే నష్టాలేమిటి, లాభాలేమిటని బేరీజులు వేస్తూ మీడియా చానెల్స్ ఇప్పటికే ఊదరగొడుతున్నాయి. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో చేరితే వైసీపీకి ఏయే పదవులు కట్టబెట్టబోతున్నారో కూడా బయటకు వచ్చినట్టు ఒక లీకు చక్కర్లు కొడుతుంది.  

వైసీపీకి ఇచ్చే పదవులపై కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే జగన్ కి తెలియపరిచినట్టు వార్తలు వస్తున్నాయి.  గత పర్యాయం అన్నాడీఎంకే కి ఇచ్చినట్టు ఈ సారి వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు మరో కాబినెట్ బెర్తును కూడా ఆఫర్ చేసిందట బీజేపీ. 

ఇక ఈ పోస్టులకు సెలెక్షన్లు కూడా జరిగిపోయాయనే టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. అమలాపురం నుంచి గెలిచిన దళిత ఎంపీ చింతా అనురాధను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

Also read: ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?

ఇక కేబినెట్ బెర్తు కోసం అందరూ ఊహించినట్టే, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని మోడీ కేబినెట్ లో మంత్రిని చేయవచ్చని అంటున్నారు. ఇవి ప్రస్తుతానికి వైసీపీకి దక్కనున్నట్టుగా చెబుతున్న కాబినెట్ బెర్తులు. 

ఈ ఏప్రిల్ నాటికి 6గురు రాజ్యసభ సభ్యులను కలిగిన పార్టీగా వైసీపీ అవతరిస్తుంది. రాజ్యసభలో బిల్లులను పాస్ చేపించుకోవడానికి నానా తంటాలుపడుతున్నబీజేపీకి ఇప్పుడు వైసీపీ రూపంలో ఒక ఉపశమనం లభించినట్టే చెప్పుకోవచ్చు. 

click me!