దేవుడి దయతో వర్షాలు కావాలా?.. చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలా?: సీఎం జగన్

Published : Jul 08, 2023, 01:42 PM IST
దేవుడి దయతో వర్షాలు కావాలా?.. చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలా?: సీఎం జగన్

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై సీఎం జగన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదల ప్రభుత్వం కావాలా?.. పెత్తందార్ల ప్రభుత్వం కావాలా? అనేది ప్రజలు ఆలోచన  చేయాలని కోరారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై సీఎం జగన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు. 

తమ  ప్రభుత్వం సున్నా వడ్డీకే రైతులకు రుణాలను అందిస్తుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడొద్దన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా తామే కట్టామని అన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు.  రాష్ట్రంలో పగటిపూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. గతంలో రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని.. ఇప్పుడు చంద్రబాబు గజ దొంగల ముఠా ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. 

రైతులను మోసం చేయకూడదనే నిబద్దత పాలకుడికి ఉండాలని.. అలాంటి మనిషిని వైఎస్సార్ అని, జగనన్న అని  అంటారని అన్నారు. అలాంటి నైతికత లేని మనిషిని  చంద్రబాబు అని అంటారని విమర్శలు గుప్పించారు. పాడి, పంట ఉండే నాయకత్వం కావాలా?.. నక్కలు, తోడేలు ఉండే నాయకత్వం కావాలా?, పేదల ప్రభుత్వం కావాలా?.. పెత్తందార్ల ప్రభుత్వం కావాలా?,  రైతుకు తోడుకు ఉండే ఆర్బీకే ప్రభుత్వం కావాలా?.. గతంలో మాదిరిగా దళారుగా తోడుగా ఉండే ప్రభుత్వం కావాలా?, దేవుడి  దయతో వర్షాలు కావాలా?.. చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలా?, మాట తప్పని ప్రభుత్వం కావాలా?.. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ప్రభుత్వం కావాలా? అని ఆలోచన చేయాలని  కోరారు. 

రాబోయే రోజుల్లో కురక్షేత్ర సంగ్రామం జరగబోతుందని.. మరిన్ని అబద్దాలతో చంద్రబాబు దొంగల ముఠా ఏకం అవుతారని విమర్శించారు. తాను వాళ్లకు మాదిరి అబద్దాలు చెప్పడం చేతకాదని, మోసం చేయడం చేతకాదని విమర్శించారు. మీ ఇంట్లో మంచి జరిగిందని అనుకుంటే తనకు తోడుగా నిలవాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!