ఇడుపులపాయలో వైఎస్ కు ఘన నివాళి అర్పించిన షర్మిల, విజయమ్మ (వీడియో)

By SumaBala BukkaFirst Published Jul 8, 2023, 1:04 PM IST
Highlights

నేడు వైఎస్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఇడుపులపాయలో ఘన నివాళి అర్పించారు. షర్మిల, విజయమ్మ సమాధి వద్ద ప్రార్థనలను నిర్వహించారు. 

ఇడుపులపాయ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వీరు వైఎస్ సమాధి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. షర్మిల ఫ్యామిలీ నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా వీరితో పాటు వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైసీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, బంకా సోమేశ్వరరెడ్డి, రామగంగిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ రాజు ఉన్నారు. షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం 4.30 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

ఇదిలా ఉండగా, వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మీడియాకు అనుమతి లేదు. ప్రజా సంబంధాల శాఖ దీనికి పాసులజారీని కూడా నిలిపేసింది. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద కార్యక్రమాలకు సైతం అనుమతిలేదన్నారు. ఫొటోలు, వీడియోలు, పత్రికా ప్రకటనలు ఇస్తామని తెలిపారు. మీడియాను అనుమతించకపోవడానికి స్థలాభావం కూడా కారణం అని తెలుపుతున్నారు. 

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మీడియా మీద ఇలాంటి నిర్ణయానికి తీసుకోగా.. మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన కవరేజీకి మీడియా హజరు కావాలని మాత్రం మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇడుపులపాయలో షర్మిల పర్యటన కవరేజికి అనుమతి ఉందంటూ మీడియాకు మెసేస్ లు వచ్చాయి. దీంతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్ చేసి మరీ మీడియా ప్రతినిధులకు తెలిపారు. 

దీనికోసం శుక్రవారమే హైదరాబాద్ నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలీ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విజయమ్మ ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ షర్మిల అక్కడినుంచి వేంపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9.53 ఎకరాల భూమిని తన కొడుకు రాజారెడ్డి పేరుతో దాన విక్రయం రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించారు. 

ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి 2.12 ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె అంజలీరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.  అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తల్లి విజయమ్మతో కలిసి రాత్రి బస చేశారు. శనివారం ఉదయం వైఎస్ ఘాట్ చేరుకుని నివాళులర్పించనున్నారు. తర్వాత హైదరాబాద్ కు వెళ్తారు. 

click me!