చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 25, 2019, 01:48 PM IST
చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

గత ప్రభుత్వ హాయంలో  అన్ని రకాల ఉల్లంఘనలు చోటు చేసుకొన్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అక్రమంగా నిర్మించిన భవనంలో సీఎం నివాసం ఉన్నారని... తాను నివాసం ఉన్న భవనం పక్కనే  ప్రభుత్వ నిధులతో  ప్రజా వేదికను  నిర్మించారని  మాజీ సీఎం బాబుపై జగన్ మండిపడ్డారు

అమరావతి: గత ప్రభుత్వ హాయంలో  అన్ని రకాల ఉల్లంఘనలు చోటు చేసుకొన్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అక్రమంగా నిర్మించిన భవనంలో సీఎం నివాసం ఉన్నారని... తాను నివాసం ఉన్న భవనం పక్కనే  ప్రభుత్వ నిధులతో  ప్రజా వేదికను  నిర్మించారని  మాజీ సీఎం బాబుపై జగన్ మండిపడ్డారు.  ఇదెలా సుపరిపాలన అవుతుందని ఆయన ప్రశ్నించారు.

మంగళవారం నాడు అమరావతిలో  కలెక్టర్లు,ఎస్పీలతో  ఏపీ సీఎం జగన్ రెండో రోజూ సమావేశాన్ని కొనసాగించారు. ఈ సమావేశంలో  జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.  గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు అక్రమంగా మైనింగ్ పాల్పడితే ఏం చేశారని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

థియేటర్లతో పాటు పలు సంస్థల నుండి  ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తే పోలీసులు చూస్తూ కూర్చొన్నారన్నారు. ఇదేనా నెంబర్ వన్ పోలీసింగ్ అంటూ ఆయన దెప్పిపొడిచారు. ఈ సమావేశం జరుగుతున్న ప్రజా వేదిక భవనం కూడ అక్రమంగా నిర్మించేదేనని ఆయన గుర్తు చేశారు. నిన్న కూడ ఐఎఎస్‌ల సమావేశంలో ఈ విషయాన్ని తాను  ప్రస్తావించినట్టుగా చెప్పారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు జరిగితే చూస్తూ కూర్చొన్నామని  ఆయన చెప్పారు. ఇదేనా సుపరిపాలన అంటూ  జగన్ ప్రశ్నించారు.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇసుక మాఫియాలో  పోలీసుల జోక్యం ఉండేదని జగన్ గుర్తు చేశారు.  ఇసుక మాఫియాకు అడ్డుపడిన ఓ మహిళా రెవిన్యూ అధికారిపై దాడికి కూడ పాల్పడినా పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదన్నారు. 

 వ్యవస్థలు మారాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్నట్టుగా ఉల్లంఘనలను తాను సహించబోనన్నారు. వ్యవస్థలను మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  వ్యవస్థల మార్పుకు ముందుకు వస్తే అధికారులకు తాను అండగా నిలుస్తానని ఆయన చెప్పారు.

అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ డబ్బులను చెల్లించని మహిళలను లైంగికంగా వేధించారు, కాల్ మనీ సెక్స్ రాకెట్‌ పై ఎన్ని కేసులు నమోదు చేశారని జగన్ ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహించాలని ఆయన కోరారు.చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాల్సిందిగా ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీఎం జగన్ సీరియస్: ఎవరినీ వదలొద్దు

త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?