ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

Published : Jun 25, 2019, 01:15 PM IST
ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

సారాంశం

ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలీసులను ఆదేశించారు.  

అమరావతి:ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలీసులను ఆదేశించారు.

మంగళవారం నాడు అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం సమావేశమయ్యారు.ఏపీ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అభివృద్ది చెందిన దేశాల్లో  ప్రజలే పోలీసులను ఎంపిక చేసుకొంటారని ఆయన చెప్పారు.మనకు నచ్చినా నచ్చకపోయినా కూడ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందేనని జగన్ పోలీసులకు తేల్చి చెప్పారు. తప్పు చేస్తే ఎవరినీ కూడ వదలొద్దని  సీఎం కోరారు.

పోలీసులు కూడ మనవాళ్లే అని ప్రజలు అనుకొనేలా  పోలీసులు పనిచేయాల్సిన అవసరం ఉందని  జగన్ అభిప్రాయపడ్డారు.  ప్రజలను చిరునవ్వుతో  పలకరించి... వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీఎం జగన్ సీరియస్: ఎవరినీ వదలొద్దు

త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు