జగన్ నిర్ణయంపై గవర్నర్ కి రఘువీరా లేఖ

Published : Jun 25, 2019, 01:46 PM IST
జగన్ నిర్ణయంపై గవర్నర్ కి రఘువీరా లేఖ

సారాంశం

ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్... ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్... ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ సమస్యను పరిష్కారంలో భాగంగా ఈ గ్రామ వాలంటీర్ల విధానాన్ని జగన్ ప్రవేశపెట్టారు. అయితే..  ఈ గ్రామ వాలంటీర్ల విధానంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గవర్నర్ కి లేఖ రాశారు.

గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియకు సంబంధించి రఘువీరా రెడ్డి లేఖ రాశారు. ప్రతిభ ఆధారంగా గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయాలని ఆయన కోరారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్హత ఆధారంగా వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తే ఆందోళనకు దిగుతామని రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?