నంద్యాలలో సలాం కుటుంబం సూసైడ్: జగన్ స్పందన ఇదీ

By narsimha lodeFirst Published Nov 11, 2020, 1:49 PM IST
Highlights

: నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై  సీఎం జగన్  బుధవారం నాడు స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. 
 

అమరావతి: నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై  సీఎం జగన్  బుధవారం నాడు స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. 

 

నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం జగన్ స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. pic.twitter.com/rvW1rCCpJ1

— Asianetnews Telugu (@AsianetNewsTL)

టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు.ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

also read:నలుగురు ఆత్మహత్య: చంద్రబాబుకు ఆంజాద్ బాషా కౌంటర్

ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని  కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఎవరికైనా న్యాయం  ఒకటేనని ఆయన చెప్పారు.  

తప్పు చేసిన వారెవరైనా  చర్యలు తీసుకొంటామని జగన్ స్పష్టం చేశారు.ఎక్కడా కూడ తన పర అనే బేధం చూపలేదని ఆయన చెప్పారు. నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ అబ్దుల్ కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటనలో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు కానిస్టేబుల్ గంగాధర్ ను ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేశారు.

 

 

 

click me!