కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో వైఎస్ జగన్ భేటీ: రాష్ట్ర సమస్యలపై చర్చ

By narsimha lode  |  First Published Apr 6, 2022, 10:05 AM IST


ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం జగన్ చర్చించారు. నిన్న ప్రధానితో సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే.
 


న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి Nitin Gadkari తో బుధవారం నాడు ఏపీ సీఎం YS Jagan  భేటీ అయ్యారు. సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన ఇవాళ నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.

విశాఖ- భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు  అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని  సీఎం జగన్ కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించారు.

Latest Videos

 విశాఖనుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని జగన్ కేంద్ర మంత్రిని కోరారు.రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని  సీఎం విన్నవించారు.
 
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ  జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని  సీఎం కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం కోరారు.

మంగళవారం నాడు సీఎం జగన్ గన్నవరం నుండి New Delhiకి వచ్చారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని Narendra Modi తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై  సీఎం జగన్ చర్చించారు.  పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. 

గంటకు పైగా సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ , ఏపీ రాష్ట్ర రెవిన్యూ లోటు భర్తీ అంశాలను సీఎం జగన్  ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యుత్ బకాయిల  చెల్లింపు వంటి అంశాలపై కూడా సీఎం జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించారు.

Polavaram ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లుగా నిపుణుల కమిటీ నిర్ధారించింది. అయితే ఈ అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలి. ఈ విషయమై ప్రధానితో జగన్ సుదీర్థంగా చర్చించారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్దిదారుల ప్రస్తుతం ఇస్తున్న Rationను పెంచాలన్నారు.  ఏపీ పునర్విభజన చట్టం మేరకు Andhra Pradesh , Telangana  రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ కోరారు. రాష్ట్రానికి 12 Medical   కాలేజీలకు అనుమతులను ఇవ్వాలని కూడా సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లతో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై  సీఎం జగన్ ఈ ఇద్దరు మంత్రులతో చర్చించారు.

ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.

మూడు మాసాల తర్వాత ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ఈ ఏడాది జనవరి 3న ఏపీ సీఎం జగన్ ప్రధానితో భేటీ అయ్యారు.  ఆ తర్వాత నిన్ననే సీఎం జగన్ మోడీతో సమావేశమయ్యారు.
 

click me!