స్నేహితుడిని చంపి, చెరువులో పాతిపెట్టి.. తన లవర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని దారుణం..

Published : Apr 06, 2022, 09:49 AM IST
స్నేహితుడిని చంపి, చెరువులో పాతిపెట్టి.. తన లవర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని దారుణం..

సారాంశం

తన లవర్ తో స్నేహితుడు ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఓ వ్యక్తి దారుణానికి తెగించాడు. ఎంత చెప్పినా స్నేహితుడు వినకపోవడంతో హత్య చేసి.. చెరువులో పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. కానీ ఏడాది తరువాత.. 

చిత్తూరు :  Extra Marital Affair కారణంగా స్నేహితుడిని హత్యచేసి చెరువులో పాతి పెట్టాడు ఓ వ్యక్తి..  ఈ murder కేసు mysteryని పోలీసులు ఏడాది తర్వాత చేదించి.. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట సీఐప్రసాద్ బాబు కథనం మేరకు పట్టణ పరిధిలోని ముదిమడుకుకు చెందిన షరీఫ్  కుమారుడు ఇస్మాయిల్ (23) ఎలక్ట్రిషన్. ఇతనికి పట్టణంలోని నారాయణ నగర్ కు చెందిన నరేష్ తో స్నేహం ఏర్పడింది. వీరి స్నేహం మొదలైన ఏడాదిన్నర తర్వాత ismail బెంగళూరుకు వెళ్లి బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే పని చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో నరేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నరేష్ ఇంటి వాళ్ళు గొడవ చేయగా ఆ మహిళతోనే ఉండిపోయాడు. ఈ సమయంలో అప్పుడప్పుడు స్నేహితుడు వద్దకు వచ్చిపోతున్న ఇస్మాయిల్, నరేష్ ప్రియురాలితో సన్నిహితంగా మెలిగేవాడు. నరేష్ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన నరేష్ ఇస్మాయిల్ ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్నడబ్బులు చెల్లించాలని నిరుడు జనవరి 5న  ఇస్మాయిల్, నరేష్ ను అని అడిగాడు.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్ నరేష్ కి ఫోన్ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ కలిసి మద్యం బాటిల్ తీసుకుని వీకోట చెరువులోకి వెళ్లారు. అక్కడ మహిళ విషయంలో వీరి మధ్య వాదులాట జరిగింది. ఇదే అదనుగా నరేష్ మందు తాగుతున్నట్టు నటించి ఇస్మాయిల్ మందు తాగే సమయంలో మందు బాటిల్ తో తలపై బలంగా కొట్టి చంపేశాడు.  ఇస్మాయిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ఇసుక కోసం తీసిన గుంతలో మృతదేహాన్ని వేసి మట్టి కప్పివెళ్ళిపోయాడు.

మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్నేహితులని విచారించడంతో..  నరేష్ సోమవారం తన నేరాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.  ఇస్మాయిల్ ను  పాతిపెట్టిన ప్రదేశానికి మండల రెవెన్యూ సిబ్బంది,  పోలీసులు చేరుకున్నారు. అయితే చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదని సీఐ,  తహసిల్దార్ పుల్లారావు తెలిపారు. మొబైల్ ఫోన్ ఆధారంగా హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు అందుజేశారు.

ఇదిలా ఉండగా, తమ extramarital affairకి అడ్డుగా ఉన్నాడని భావించి husband తాగే liquorలో విషం (కుక్కలను చంపే మందు) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  వివరాలు ఇలా ఉన్నాయి..  తిరుమలాయపాలెం మండలంలోని  సుబ్లేడు గ్రామానికి చెందిన డాబా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఆమెకు అదే గ్రామానికి చెందిన పంచాయతీ వాటర్ manora పాపయ్య తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. తన వివాహేతర సంబంధానికి దెబ్బ పడేలా ఉండాల్సి రావడంతో.. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్యక్తి వద్ద కుక్కలనుచంపే మందు కొనుగోలు చేశారు. గత నెల 30న రాత్రి సమయంలో షేక్ మస్తాన్ ద్వారా ఓ మద్యం బాటిల్ లో కలిపి కనకరాజు ఇవ్వాలి అని చెప్పి పంపించారు.  ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్ళాక కాళ్ళు, చేతులు లాగుతున్నాయి అని చెప్పడంతో.. కుటుంబసభ్యులు  ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనకరాజు మృతి చెందాడు.
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu