ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయలు.. ఆ హామీలన్నీ ఏమయ్యాయి : జగన్‌కు నారా లోకేష్ లేఖ

Siva Kodati |  
Published : Apr 05, 2022, 09:50 PM IST
ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయలు.. ఆ హామీలన్నీ ఏమయ్యాయి : జగన్‌కు నారా లోకేష్ లేఖ

సారాంశం

వాల్మీకి , బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ నేత నారా లోకేష్ మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు (Ys jagan ) టీడీపీ (tdp) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ (nara lokesh) లేఖ రాశారు. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ‌ల‌ను (valmiki boya) ఎస్టీ జాబితాలో (st category) చేర్చాల‌ని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చే దిశ‌గా టీడీపీ హ‌యాంలో జ‌రిగిన చ‌ర్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆయన ప్ర‌స్తావించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు

‘‘టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో వాల్మీకి/బోయ‌ల‌ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం వ‌ద్ద చేసిన కృషిని కొన‌సాగించి సాధించాలని సీఎం 
జగన్‌కు లేఖ రాశాను. పురాత‌న కాలం నుంచీ వేట, అట‌వీ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ వృత్తిగా జీవ‌నం సాగిస్తున్న నిరుపేద వాల్మీకి/బోయ‌ల‌ని ఎస్టీల్లో చేర్చి.. వారి జీవ‌న‌స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న 2014-19లో విశేష‌ కృషి చేసింది’’.

‘‘ ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వున్న‌ప్పుడు మీరు రాష్ట్ర‌వ్యాప్తంగా వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాన‌ని, టిడిపి ప్ర‌భుత్వం పంపిన తీర్మానాలు కాకుండా తాను సీఎం అయ్యాక మొద‌టి అసెంబ్లీ సమావేశాల‌కే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తాన‌ని చేసిన వాగ్దానాలు ఏమ‌య్యాయి జగన్ గారూ! మీరు ముఖ్య‌మంత్రి అయి మూడేళ్ల‌యినా, చాలాసార్లు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగినా వాల్మీకులు/బోయ‌ల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు క‌నీసం చ‌ర్చ కూడా చేయ‌లేదంటూ’’ లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంతకుముందుం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపైనా విమర్శలు గుప్పించారు లోకేశ్. జగన్ సడన్ గా డిల్లీకి వెళ్ళడం వెనక రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలు వున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టారు.  

పేలని జ'గన్' హస్తిన పయనమెందుకు?

ఏ1) బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకు.

ఏ2) తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని.

ఏ3) తన పై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని.

ఏ4) లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్